Quit luxury: విలాసాలు వద్దు.. సింప్లిసిటీ ముద్దు.. ఫ్యాషన్ ప్రపంచంలో నయా ట్రెండ్!

‘క్విట్ లగ్జరీ’ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక్క మాటలో చెప్పాలంటే ‘లగ్జరీ స్టేటస్‌’‌కు బదులుగా సింప్లిసిటీని ఫాలో అవడం. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో దీని గురించి చాలా మంది యువతీ, యువకులు డిస్కస్ చేస్తున్నారు.

Update: 2024-07-18 13:12 GMT

దిశ, ఫీచర్స్: ‘క్విట్ లగ్జరీ’ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక్క మాటలో చెప్పాలంటే ‘లగ్జరీ స్టేటస్‌’‌కు బదులుగా సింప్లిసిటీని ఫాలో అవడం. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో దీని గురించి చాలా మంది యువతీ, యువకులు డిస్కస్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మార్క్ జుకర్ బర్గ్ లాంటి ప్రముఖులు కూడా ఈ సరికొత్త ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్నారు. ఈ లేటెస్ట్ ట్రెండ్ మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెరుగుతున్న ఆసక్తి

ఇన్నాళ్లు చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఖరీదైన బ్రాండెడ్ దుస్తులను ధరించాలని, తాము విలాసవంతమైన జీవితాన్ని గడిపే వారిగా గుర్తింపు పొందాలని ఆరాట పడేవారు. కానీ ఇటీవల పలువురిలో అభిప్రాయాలు మారుతున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకున్నా, అనేక విషయాల్లో విలాసవంతమైన జీవన శైలిని కలిగి ఉన్నా దుస్తులు ధరించడంలో మాత్రం సింప్లిసిటీని అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంటే ధనవంతులు సాధారణ వ్యక్తులను ఫాలో అయ్యే సరికొత్త ధోరణి.

రీసెంట్ మూవ్‌మెంట్!

‘క్విట్ లగ్జరీ’ రీసెంట్ డెవలప్‌మెంట్ మూవ్‌మెంట్‌గా అనిపించవచ్చు కానీ ఇది గతంలో కూడా ఉండేదని, కాకపోతే చాలా తక్కువగా ఉండేదని పలువురు ఫ్యాషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా వినియోగదారులు తమ వార్డ్‌రోబ్‌లో కొన్ని హై క్వాలిటీ పీసెస్ కలిగి ఉన్నప్పటికీ సింప్లిసిటీనే అనుసరించే వారు కూడా అరుదుగానైనా ఉండేవారట. కాకపోతే 2024లో రిచ్ అండ్ ఫేమస్ ఐటమ్స్‌ ప్రయారిటీని తగ్గించడం ద్వారా ప్రముఖులు కూడా ఈ నయా ట్రెండ్‌కు దగ్గరవుతున్నారు.

మానసిక స్థితికి ప్రాధాన్యత

దుస్తులు ధరించడంలో, ఫ్యాషన్‌ ఫాలోయింగ్‌లో బాహ్య సౌందర్యానికంటే మానసిక సౌందర్యానికి, మానసికి స్థితికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం క్విట్ లగ్జరీలో ప్రముఖంగా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ కొన్ని విజువల్ ఎలిమెంట్స్ కూడా ఉంటున్నాయి. ఉదాహరణకు న్యూట్రల్ కలర్స్, అలాగే స్ట్రీమ్ లైన్డ్ సిల్హౌట్స్‌ వంటి దుస్తుల ఎంపికకు ప్రయారిటీ ఇస్తున్నారు పలువురు. మరికొందరు క్విట్ లగ్జరీ అనేది కొన్ని నిర్దిష్టమైన బ్రాండ్‌లతో స్థిరమైన, నిజమైన రిలేషన్‌షిప్‌ను డెవలప్ చేయడం లాంటిదని కూడా అంటున్నారు. ఒక విధంగా ఇది యాంటీ ఫ్యాషన్‌గా, మల్టిపుల్ యూజ్‌గానూ ఉంటుంది.

ఆచరణలో క్విట్ లగ్జరీ

క్విట్ లగ్జరీ ఫ్యాషన్ కేవలం డిస్కషన్ వరకే పరిమితం కాలేదు. దీనికి రియల్ లైఫ్ ఎగ్జామ్‌పుల్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు మీరు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెలబ్రిటీలు గ్వినేత్ పాల్ట్రో, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వంటి వారిని గమనించారా? వీరు గొప్ప ధనవంతులే కావచ్చు. కానీ వారు ధరించే దుస్తులు, ప్రవర్తన సామాన్య వ్యక్తుల మాదిరే ఉంటుంది. లైఫ్ స్టైల్ చాలా సింప్లిసిటీగా అనిపిస్తుంది. జుకర్ బర్గ్ అయితే ఎక్కువగా ఒక గ్రే కలర్ టీ షర్టునే ధరిస్తుంటాడు.

సౌలభ్యం, సౌకర్యం ముఖ్యం

క్విట్ లగ్జరీలో ఫాస్ట్ ఫ్యాషన్ కంటే కూడా సౌలభ్యం, సౌకర్యం, మానసిక ఆనందం ప్రధాన అంశాలుగా ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు. న్యూట్రల్ కలర్స్‌ కలిగిన సౌంకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవడాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. సింపుల్‌గా ఉండటం, ఒకే తరహా దుస్తులు, యాక్సెసరీస్, నగలు వంటివి ధరించడం క్విట్ లగ్జరీలో అంతిమ లక్ష్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దుస్తులకే పరిమితమైన ఈ ట్రెండ్ భవిష్యత్తులో అన్ని విషయాల్లోనూ విస్తరిస్తూ సింప్లిసిటీని ప్రతిబింబిస్తుందని పేర్కొంటున్నారు. 

Tags:    

Similar News