Pulses : ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలివే.. ఎందులో ఎంతమేర లభిస్తాయంటే..

Pulses : ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలివే.. ఎందులో ఎంతమేర లభిస్తాయంటే..

Update: 2024-10-09 13:37 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన ప్రోటీన్లు అవసరం. జుట్టు, చర్మం, కండరాలు, ఎముకలు బలంగా ఉండటంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవాల్సిందే. అయితే అవి ఎక్కువగా పప్పుధాన్యాల నుంచి లభిస్తాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అవి ఏవి? ఎందులో ఎంత మేర పోషకాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

*పెసర్లు : సులువుగా జీర్ణం కాగల పప్పుధాన్యాలుగా పెసర్లు చాలా ప్రసిద్ధి. ప్రతీ వంద గ్రాముల పెసర పప్పులో 25 గ్రాముల మేర ప్రోటీన్ లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే పెసర పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శారీరక దృఢత్వానికి ఈ పప్పు మంచిది.

*మినుమలు : ప్రోటీన్లు పుష్కలంగా లభించే పప్పుధాన్యాల్లో మినుములు ఒకటి. ప్రతీ వంద గ్రాముల మినపప్పు ద్వారా దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. దీంతోపాటు ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

*కంది పప్పు: కంది పప్పులో కూడా ప్రతీ వంద గ్రాములకు దాదాపు 22 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. పైగా ఇందులో పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనం కోసం పప్పు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే పోషకాహార నిపుణులను సంప్రదించగలరు. 


Similar News