Minimalist habits : సంపూర్ణ జీవితం గురించిన ఆలోచనలతో పెరుగుతున్న ఒత్తిడి..‘మినిమలిస్ట్’ హాబిట్స్‌తో బయటపడే మార్గం!

Minimalist habits : సంపూర్ణ జీవితంపై ఆలోచనతో పెరుగుతున్న ఒత్తిడి..‘మినిమలిస్ట్’ హాబిట్స్‌తో బయటపడే మార్గం!

Update: 2024-10-14 12:23 GMT

దిశ, ఫీచర్స్ : వస్తువైనా, అందం అయినా, సంపద అయినా ఇతరులకంటే ఎక్కువ కలిగి ఉంటేనే సంపూర్ణ జీవితమనే భ్రమ, అత్యాశ నిజానికి అనేక మందిలో ఒత్తిడికి, గందరగోళానికి కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. వాటిని సాధించాలనే అతి ఆతృత, ప్రయత్నం కారణంగా జీవితంలో మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అలాంటి పరిస్థతి నుంచి బయటపడే మార్గమే మినిమలిజం‌గా పేర్కొంటున్నారు. ఒకప్పుడు అవసరం లేని వస్తువులను తగ్గించడం, అవసరం ఉన్నవి మాత్రమే కలిగి ఉండటం, అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకోవడం ద్వారా పొందే ఆనందం లేదా సౌకర్యానికి ప్రతీకగా మినిమలిజాన్ని భావించేవారు. ప్రస్తుతం అది వస్తువులకే పరిమితం కాలేదు. మానవ జీవితానికి వర్తింపజేసుకోవడం ద్వారా లైఫ్‌లో సంతోషంగా ఉండగలుగుతామని మానసిక నిపుణులు అంటున్నారు.

బ్యూటీ లెస్ భావనను వదిలేయండి

మీరు అందంగా కనిపించాలంటే ఫలానా రకమైన స్టైల్ మాత్రమే కరెక్ట్ అని, ఫలానా బ్రాండ్ అయితే బెటర్ అని కొందరు చెప్తుంటారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు దీనిని ప్రచారం చేస్తుంటారు. అలాగే ఎక్కువ బట్టలు, ఎక్కువ గాడ్జెట్స్ కలిగి ఉండటం, ఎక్కువ అందంగా కనిపించడం ఇలా ప్రతీ విషయంలో ‘ఎక్కువ’ అనేది బ్యూటీ ట్రెండ్‌గా ప్రచారంలో ఉంటుంది. దీనిని ఫాలో అయ్యేవారు జీవితంలో అనేక విషయాల్లో ఉన్నదానితో సంతృత్తి చెందరు. ‘ఎక్కువ’ పొందాలని లేదా సాధించాలనే ప్రయత్నంలో భ్రమలకు, ఆందోళనకు గురవుతుంటారు. దీంతో మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కాబట్టి మీరు ఉన్నదానితో సంతృప్తి పొందాలంటే.. మీరు కలిగి ఉన్నదానిపట్ల ‘బ్యూటీలెస్ భావన’ను వదిలేయాలి అంటున్నారు మానసిక నిపుణులు.

అనుభవాలకే ప్రాధాన్యత 

లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో కావడం, కొత్తగా వచ్చిన వస్తువులు కలిగి ఉండాలనుకోవడంలో తప్పు లేదు. కానీ అవి మాత్రమే జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయని, మెరుగు పరుస్తాయని, మీ విలువను పెంచుతాయని అనుకుంటే పొరపాటే. పైగా వాటితోనే సౌకర్యంగా, సంతోషంగా ఉంటుందనే భావనే కొందరిలో ఒక వ్యసనంగా మారుతుంది. దీంతో వారు ఒత్తిడికి గురవుతుంటారు. ఇక్కడే ఇక్కడే మీకు మినిమిటిస్ట్ అలవాటు అవసరం అవుతుంది. పరిపూర్ణత, సంపూర్ణత అతనేది ఎక్కువ మొత్తంలో పొందడంవల్ల రాదు. మీకు ఉన్నవాటిలోనే సంతృప్తి పొందడంవల్ల వస్తుందని నిపుణులు చెప్తున్నారు. వస్తువులు, ఆస్తులకంటే మీకు మీ అనుభవాలే నిజమైన సంతోషాన్ని, సౌకర్యాన్ని కలిగిస్తాయని గుర్తించేదే మినిమిలిజం.

మనసుపై ప్రభావం

మీరు చిందర వందరగా ఉండే గదిలోకి వెళ్లినప్పుడు ఎలాంటి అనుభూతిని చెందుతారు?, ఏదో అసౌకర్యంగా, గందరగోళంగా అనిపిస్తుంది కదూ.. అలాగే మనస్సు కూడా భౌతిక ప్రదేశాల మాదిరి అన్నీ ఎక్కువ మొత్తంలో కలిగి ఉండాలనే ప్రయత్నంలో అలసిపోతుంది. నిరాశకు గురవుతుంది. అప్పుడు తెలియని దరగోళం వెంటాడుతుంది. అలాంటప్పుడే మానసిక మినిమలిజం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. అంటే ఇక్కడ మీ మనసుకు కష్టతరమైన ఆలోచనలను నివారించాలి. గందరగోళ పరిచే ‘ఎక్కువ భావన’ నుంచి డైవర్ట్ చేయాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటివి ప్యత్నించవచ్చు.

షెడ్యూల్‌ను సింప్లిఫై చేయడం

జీవితంలో లక్ష్యం కలిగి ఉండటం, సాధించాలనుకోవడం మంచిదే కానీ.. ఏదో సాధించాలనే అతి ఆలోచనలతో గందరగోళానికి గురవుతుంటారు. వనరులు, అవకాశాలు, అర్హతలను పరిగణనలోకి తీసుకోకుండా కట్టుబాట్లు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత లక్ష్యాలు అన్నింటా తామే బెటర్‌గా ఉండాలని ప్రయత్నించడం ఇక్కడ మరింత గందరగోళానికి దారితీస్తుంది. మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి మీ ఆలోచనలను, లక్ష్యాలను, బాధ్యతల షెడ్యూల్‌ను సరళీ‌కృతం చేయడమే మినమలిజం. అంటే వాస్తవాలపై ఆధారపడి మీ అవసరాల గురించి ఆలోచించాలి తప్ప అనవసరంగా టెన్షన్ పడటం తగదంటున్నారు నిపుణులు.

విషపూరిత బంధాలకు దూరంగా

ఇక్కడ మానవ సంబంధాలకూ మినిమిలిజం వర్తిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కొందరు మీ వ్యక్తిగత, వృత్తి జీవితానికి ఆటంకంగా మారవచ్చు. ఏదో మనసులో పెట్టుకొని పరోక్షంగా మిమ్మల్ని టార్గెట్ చేయవచ్చు. తరచుగా డిస్టర్బ్ చేస్తూ మీ శక్తిని హరించవచ్చు. అలాంటి వ్యక్తులతో కలిసి ఉండటం మీలో మానసిక క్షోభను తీవ్రతరం చేస్తుంటే గనుక ఇక్కడ మినిమిలిజం పనిచేస్తుంది. అంటే మీకు హానిచేసే సంబంధాలతో తక్కువ క్లోజ్‌గా ఉంటూ.. మీకు మేలు చేసేవారితో ఎక్కువ క్లోజ్‌గా మూవ్ అవడం మీకు మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అర్థవంతమైన పాజిటివ్ రిలేషన్స్ పెంపొందించుకోవడం మీరు ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటంలో సహాయపడుతుంది. అందుకే ప్రశాంతత కోసం ఒత్తిడిని, స్పష్టతకోసం గందరగోళాన్ని వదులోకోవడమే ఇప్పుడు మినిమలిస్ట్ ప్రధాన లక్ష్యం. 

Tags:    

Similar News