కాలేజ్‌‌కు వెళ్లే కూతురిపై కేసు వేసిన తండ్రి.. ప్రతి నెల పరిహారం చెల్లించాలని డిమాండ్

కారు ప్రమాదానికి గురైన ఓ తండ్రి.. తన కూతురు తనను విస్మరించిందని కోర్టును ఆశ్రయించాడు..

Update: 2023-03-02 09:14 GMT

దిశ, ఫీచర్స్ : కారు ప్రమాదానికి గురైన ఓ తండ్రి.. తన కూతురు తనను విస్మరించిందని కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం స్టూడెంట్ అయిన ఆమె.. కాలేజ్ అయిపోయాక తనను చూసుకునేందుకు ఇంటికి రావడం లేదని ఆరోపించాడు. కన్విన్స్ చేసేందుకు కాల్స్, మెసేజెస్ చేసిన ఫలితం లేకుండా పోయిందని.. చివరికి ఆమె తన నంబర్ బ్లా్క్ చేసిందని ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేశాడు చైనాకు చెందిన ఝంగ్. ఆర్టికల్ 26 ప్రకారం తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మేజర్ అయిన పిల్లల మీద ఉందని, ఆమె తనకు నెలకు దాదాపు రూ. 18,000 చెల్లించాలని న్యాయస్థానానికి విన్నవించాడు.

దీనిపై విచారణ జరగ్గా.. తండ్రిని చూసుకునేందుకు మరో ఇద్దరు కొడుకులు ఉన్నా ఎప్పుడూ తననే టార్చర్ చేస్తున్నారని న్యాయమూర్తికి వివరించింది సదరు కూతురు. స్టడీస్‌తో బిజీగా ఉన్న తను ఇంటికి వెళ్లి సేవ చేయడం కుదరదని.. ఇప్పటికే చదువుతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న తను ఈ ఇష్యూ కారణంగా మానసికంగా, శారీరకంగా మరింత అలసిపోతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇరువురి వాదనలు విన్న కోర్టు.. చైనీస్ సివిల్ కోడ్ ఆర్టికల్ 26 ప్రకారం వయోజన పిల్లలు తమ తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన బాధ్యతను కలిగి ఉంటారని అంగీకరించింది. తన తండ్రి దీనస్థితిని సున్నితంగా భావించాలని, చదువును నిర్లక్ష్యం చేయకుండా అతనికి సహాయం చేయాలని కుమార్తెకు సూచించింది.  

ఇవి కూడా చదవండి : Remote Kiss: ముద్దు ముచ్చట ఇలా తీర్చుకుందామా..!

Tags:    

Similar News