Life : పక్క వాళ్ల గురించి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి?
నేటి సమాజంలో మనం చేసే పని మీద శ్రద్ద పెట్టడం కంటే మన పని ఇతరులకు నచ్చుతుందా ?
దిశ, వెబ్ డెస్క్ : నేటి సమాజంలో మనం చేసే పని మీద శ్రద్ద పెట్టడం కంటే మన పని ఇతరులకు నచ్చుతుందా ? లేదా ? అనే దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాం . మనము డ్రెస్ వేసుకునే ముందు కూడా ఆలోచిస్తాం .. ఈ డ్రెస్ అందరికి నచ్చుతుందా ? లేక వారు హేళన చేస్తారా అని.. నిజానికి ఇక్కడ నచ్చాలిసింది మనకు.. అది పక్కన పెట్టేసి పక్క వాళ్లకి ఇది నచ్చుతుందా ? అని ఆలోచించడం ఎంత వరకు కరెక్ట్.
మీరు ఎవరికి బానిస కాకండి.. మీ గురించి ఎవరేమనుకుంటారా అని అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. వాళ్ల కష్టాలు గురించి ఆలోచించడం మానేయండి. మీ పై మీరు మాత్రమే దృష్టి పెట్టండి. పక్క వారన్న మాటలను పట్టించుకుంటే నువ్వు చేరాలిసిన గమ్యాన్ని ఎప్పటికి చేరలేవు. ఈ రోజు నిన్ను విమర్శించిన వారే మీరు గెలిచిన తర్వాత వాడు మా వాడురా అని చెప్పుకుంటారు. పది మంది ముందు నీ గురించి చెబుతారు. నువ్వు అనుకున్నది సాధించాలంటే నిన్ను నువ్వు నమ్మాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు.
Also Read..