Junk foods : అధికంగా తీసుకుంటే అనర్థమే.. హెల్త్‌ను రిస్క్‌లో పడేస్తున్న ఆహారాలు ఇవే..

ఒక వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా, ఫిట్‌గా ఉంటున్నారంటే అందుకు వారు తీసుకునే ఆహారాలు కూడా కారణం అవుతుంటాయి. అలాగే కొన్ని రకాల సమస్యలకు కూడా అవి దోహదం చేస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-08-23 12:42 GMT

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా, ఫిట్‌గా ఉంటున్నారంటే అందుకు వారు తీసుకునే ఆహారాలు కూడా కారణం అవుతుంటాయి. అలాగే కొన్ని రకాల సమస్యలకు కూడా అవి దోహదం చేస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. డబ్ల్యుహెచ్‌ఓ ప్రకారం కూడా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం ఒబేసిటీ, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు దారితీస్తు్న్నాయి. అలాంటి జంక్ ఫుడ్స్ ఏమిటో చూద్దాం.

* బాయిలింగ్ ఫుడ్స్ : నిజానికి నూనెలో ఎక్కువగా వేయించిన ఆహారాలలో ఉప్పు, కారం, నూనె ఎక్కువస్థాయిలో ఉంటాయి. కెలరీలు, అన్‌హెల్తీ కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు సహా వివిధ అనారోగ్యాలకు దారితీస్తాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి డబ్ల్యుహెచ్‌ఓ కూడా పేర్కొన్నది.

* అధిక చక్కెరలు : వరల్డ్ వైడ్‌గా డయాబెటిస్, ఒబేసిటీ, అధిక రక్తపోటు వంటి సమస్యలకు అధిక చక్కెర వాడకం కూడా కారణం అవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇది కాలేయం, ప్యాంక్రియాస్, మెటబాలిక్ సిస్టంను కూడా దెబ్బతీస్తుంది. అలాగని చక్కెర తీసుకోవడం పూర్తిగా మంచిది కాదని కాదు. కానీ మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* రిఫైన్డ్ ఫుడ్స్ : పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి షుగరింగ్ స్నాక్స్‌లో ఉండే రిఫైన్డ్ కార్బో హైడ్రేట్లు అన్‌హెల్తీ ఫుడ్స్ జాబితాలో ఉన్నాయి. ఇవి రక్తంలో షుగర్ అండ్ ఇన్సులిన్ లెవల్స్‌ను పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి ఎక్కువగా ప్రాసెస్ చేయడినవి కాకుండా తృణ ధాన్యాలు, బార్లీ, మిల్లెట్స్ వంటి కార్బో హైడ్రేట్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

* కాఫీ : ప్రస్తుతం కాఫీ, టీలు లేనిదే చాలామందికి పొద్దు గడవదు. కానీ వీటిని అధికంగా తీసుకోవడంవల్ల తలనొప్పి, నిద్రలేమి, అధిక రక్తపోటు, అలసట వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం గుండె జబ్బులు, జీర్ణ సమస్యలతో ముడిపడి ఉంది. కాబట్టి లిమిటెడ్‌గా తీసుకోవడం మంచిది.

* సాల్ట్ : శరీరంలో ద్రవం సమతుల్యతకు, సరైన హృదయ స్పందన రేటుకు, నరాల ఉత్తేజానికి, కండరాల సంకోచానికి సోడియం చాలా ముఖ్యం. అయినప్పటికీ పరిమితికి మించి వినియోగిస్తే హైబీపీ, కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్‌కు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

* పొటాటో చిప్స్ : అలాగే చిప్స్ మైక్రోవేవ్ పాప్‌కార్న్ వంటి ప్రాసెస్ చేసిన స్నాక్స్‌లో అన్‌హెల్తీ కొవ్వులు, ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా తరచూ తినడం ప్రమాదకరం.

* సాసేజ్ : పంది మాంసం, సాసేజ్ వంటి అధికంగా ప్రాసెస్ చేసిన మాంసాలలో కూడా సోడియం, నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రిస్కును పెంచుతాయి. జీర్ణ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి వాటిని తీసుకోకపోవడం మంచిది. డబ్ల్యుహెచ్‌ఓ కూడా రిస్క్ ఆహారాల జాబితాలో పేర్కొన్నది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News