Iv beauty therapy: అందాన్ని పెంచే ఐవీ బ్యూటీ థెరపీ.. సెలబ్రిటీలు కూడా..

అందాన్ని రెట్టింపు చేసే ఐడియాలు, చిట్కాలపై ప్రజల్లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ‘ఐవీ బ్యూటీ లేదా డ్రిప్ థెరపీ కూడా అదే కోవకు చెందింది.

Update: 2024-07-22 13:32 GMT

దిశ, ఫీచర్స్ : అందాన్ని రెట్టింపు చేసే ఐడియాలు, చిట్కాలపై ప్రజల్లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ‘ఐవీ బ్యూటీ లేదా డ్రిప్ థెరపీ కూడా అదే కోవకు చెందింది. నిజానికి ఐవీ డ్రిప్స్ అనేవి ఇంట్రా వీనస్ ఇన్ఫ్యూషన్స్. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన లిక్విడ్‌ను నేరుగా రక్త ప్రవాహంలోకి ఎక్కించడం ద్వారా స్కిన్ హెల్త్‌ను ఇప్రూవ్ చేసే మోడ్రన్ బ్యూటీ థెరపీగా నిపుణులు పేర్కొంటున్నారు? అయితే పద్ధతి మంచిదేనా?, అందం నిజంగా రెట్టింపు అవుతుందా?, ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? తదితర వివరాలను తెలుసుకుందాం.

ఏజింగ్ లక్షణాలు దూరం..

కిమ్ కర్దాషియాన్, కెండల జెన్నర్, అడెలె వంటి వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీలు పోస్టర్ బ్యూటీస్‌గా ఎంత ప్రాచుర్యం పొందారో తెలిసిందే. అయితే వీరు కూడా ఐవీ థెరపీని అనుసరిస్తున్నానే ప్రచారంతో ఈ ట్రెండ్ మరింత పాపులర్ అయింది. ఇండియాలో కూడా అడుగు పెట్టింది. మెరిసే చర్మం, మెరుగైన రోగ నిరోధక శక్తితోపాటు జుట్టు రాలే సమస్యకు చక్కటి పరిష్కారంగా కొందరు ఐవీ డ్రిప్ థెరపీని సూచిస్తున్నారు. ఎర్లీ ఏజింగ్ లక్షణాలను నివారిస్తుందని ఈ ట్రెండ్ ఫాలోవర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు పేర్కొంటున్నారు.

యాంటీ ఆక్సిడెంట్ల మిశ్రమం

ఈ ఏడాది జూన్‌లో నటుడు అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేయగా.. ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందారు. కానీ అది విటమిన్ థెరపీ సెషన్‌కు సంబంధించిందని తెలిసి తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇలా సెలబ్రిటీలే ఐవీ డ్రిప్స్ గురించి డిస్కస్ చేయడం, ప్రమోట్ చేయడం, షేర్ చేయడంతో అందాన్ని, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలన్న కుతూహలం ఉన్నవారిని మరింత ఆకట్టుకుంటోంది. ఇంట్రా వీనస్ ఇన్ఫ్యూషన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల మిశ్రమం. పైగా నేరుగా రక్త ప్రవాహంలోకి ఎక్కించే ఈ ద్రావణంవల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుందని, హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుందని, తద్వారా అందం పెరుగుతుందని పలువురు డెర్మటాలజిస్టులు పేర్కొంటున్నారు.

విటమిన్లతో చికిత్స

ఐవీ థెరపీలో విటమిన్ C, B (B1, B2, B3, B5, B6 అండ్ B12), బయోటిన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటివి ఐవీ డ్రిప్‌లో ఉపయోగించే సాధారణ పోషకాలు. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని, చర్మ ఆకృతిని, గ్లోను మెరుగు పరుస్తుందని నిపుణులు చెప్తున్నారు. అట్లనే గ్లూటా థియోన్ యాంటీ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇక విటమిన్ బి2(రిబోఫ్లావిన్) అనేది ఎనర్జీ ప్రొడక్షన్‌కు దోహదపడుతుంది. అలాగే వాపును తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మానికి కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. విటమిన్ బి3 (నియాసినమైడ్) వాపును తగ్గించి, చర్మాన్ని ప్రకాశంపజేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.విటమిన్ బి5 చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. విటమిన్ బి6 కొల్లాజెన్ ప్రొడ్యూసింగ్ ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇక బయోటిన్ జుట్టు, గోర్లు, చర్మం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో , గ్లోను పెంచడంలో సహాయపడుతుంది. జింక్ గాయాన్ని నయం చేయడంలో, మంటను తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఐవీ డ్రిప్ థెరపీవల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

సమస్యలు.. జాగ్రత్తలు

ఐవీ బ్యూటీ థెరపీ లేదా బ్యూటీ డ్రిప్‌లు మంచివేనా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?.. నిపుణుల ప్రకారం.. కేవలం హెల్తీగా ఉన్నవారికి మాత్రమే ఇవి మేలు చేస్తాయి. కిడ్నీ, హార్ట్, లివర్ ఇష్యూస్ ఉన్నవారు ఈ బ్యూటీ థెరపీకి దూరంగా ఉండటం మంచిది. అట్లనే కొన్ని రకాల ఖనిజాలు, పోషకాలు కూడా శరీరంలో ఎక్కువైనప్పుడు సైడ్ ఎఫెక్ట్స్‌కు కారణం అవుతాయి. అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి గుడ్డిగా ప్రతి ఒక్కరూ ఐవీ డ్రిప్ థెరపీని ఎంచుకోవడం మంచిది కాదని, స్కిన్ స్పెషలిస్టులను, వైద్యులను సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు. అయితే ట్రెండింగ్‌లో ఉన్న ప్రతిదీ ఆరోగ్యకరమైంది కాకపోవచ్చునని, ఐవీ బ్యూటీ డ్రిప్ లేదా బ్యూటీ థెరపీ కూడా అలాంటిదేనని, నిజానికి ఇదో రకం పిచ్చి అని మరికొందరు విమర్శిస్తున్నారు. 

Tags:    

Similar News