ఈ పొరపాట్లు చేస్తున్నారా.. యూరిక్ యాసిడ్ వేగంగా పెరుగుతుంది..

యూరిక్ యాసిడ్ నియంత్రించకపోతే, కీళ్ల నొప్పులతో సహా శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి.

Update: 2024-09-17 11:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : యూరిక్ యాసిడ్ నియంత్రించకపోతే, కీళ్ల నొప్పులతో సహా శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. దీని సహజ స్థాయి 3.5 నుండి 7.2 mg/dl మధ్య ఉండాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవ్వడం, మూత్రం ద్వారా అది బయటికి వెళ్లకపోతే అది రక్తంలో చేరడం ప్రారంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆరోగ్య పరిస్థితిని హైపర్‌ యూరిసెమియా అంటారు. ఈ సమస్య కారణంగా వేళ్లు, కాలి వేళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంది. అంతే కాదు అరికాళ్ళు ఎర్రబడటం, అధిక దాహం, కొన్నిసార్లు జ్వరం కూడా ఉంటాయి.

ఆహారపు అలవాట్లలో పొరపాట్ల వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందంటున్నారు నిపుణులు. ప్రజలు దైనందిన జీవితంలో ఎన్నో రకాల ఫుడ్ తింటుంటారు. దీని కారణంగా యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. యూరిక్ యాసిడ్ కు సంబంధించిన కొన్ని తప్పులను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి ?

ఇది మన శరీరంలో రక్తంలో ఏర్పడే వ్యర్థ పదార్థం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రసాయనాల విచ్ఛిన్నం కారణంగా ప్యూరిన్ ఏర్పడినప్పుడు, యూరిక్ యాసిడ్ రక్తంలో కలిసిపోయి మూత్రపిండాల ద్వారా వెళుతుంది. అదనపు యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళుతుంది.

ఈ తప్పులు చేయకండి.. యూరిక్ యాసిడ్ పెరుగుతుంది..

ఆయుర్వేద నిపుణుల ప్రకారం భారతీయులు ఎక్కువగా నూనె, మసాలా ఆహారాన్ని తమ దినచర్యలో భాగంగా చేసుకున్నారు. దీని ద్వారా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోల్డ్ స్టోరేజీ ద్వారా తయారు చేసే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

పప్పుల వల్ల యూరిక్ యాసిడ్..

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, పప్పులు వంటి వాటిని తినడం నిషేధించాలంటున్నారు నిపుణులు. పప్పులు అధిక ప్రోటీన్ లకు మూలం. ఈ మూలకం యూరిక్ యాసిడ్‌ను వేగంగా పెంచుతుంది. గంటల తరబడి బయట ఉంచిన పప్పులను పొరపాటున కూడా తినకూడదని అంటున్నారు నిపుణులు.

సోర్ ఫుడ్స్ నుంచి యూరిక్ యాసిడ్..

యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే వాళ్లు ఆహారంలో ఎండు యాలకుల పొడి, చింతపండు, పచ్చి టమాటా, పచ్చి మామిడికాయ పన్నా, పుల్లని వస్తువులు తినకూడదంటున్నారు నిపుణులు. యూరిక్ యాసిడ్ పెరిగితే ఆ ఆహారాల నుంచి దూరంగా ఉండాలంటున్నారు. మీరు పుల్లని వస్తువులను తినాలనుకుంటే నిమ్మకాయ లేదా ఉసిరికాయ తినవచ్చంటున్నారు నిపుణులు. నిమ్మకాయ శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

బయటి ఆహార పదార్థాలు తినకూడదు..

చిన్నపిల్లలైనా, పెద్దవారైనా బయట తయారు చేసిన ఆహారాన్ని ఇష్టపడతారు. వీటిలో సుగంధ ద్రవ్యాలు కాకుండా, పామాయిల్ ఉపయోగిస్తారు. కచోరీ, సమోసా లాంటి పదార్థాలు, శెనగపిండితో చేసిన పదార్థాలు, ఫ్రైడ్ ఐటంలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అలాగే నాన్-వెజ్ కూడా యూరిక్ యాసిడ్ రోగిని మరింత ఇబ్బంది పాలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే అందులో అధిక మొత్తంలో నూనె, కారం కలుపుతారు. ఈ ఆహారపు అలవాట్లు చిన్నవయసులోనే రోగాల బారిన పడేలా చేస్తాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు..

యూరిక్ యాసిడ్ ని నియంత్రించేందుకు జీవనశైలిలో మార్పు అవసరం అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం, శారీరక శ్రమ చేయాలంటున్నారు నిపుణులు. అల్పాహారంలో ఫైబర్ అధికంగా ఉండే వాటిని తినాలని చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనంలో పెరుగు, మజ్జిగ తినాలి. అంతే కాదు సమయానికి ఆహారం తీసుకోవాలి. రోజంతా వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. ఎందుకంటే నీళ్లు మన శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ ను తొలగిస్తుందని చెబుతున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News