గుండెకు ముప్పుగా మారుతున్న అలారం..

అలారం సౌండ్ కారణంగా రక్తపోటు, హృదయ స్పందన రేటు అకస్మాత్తుగా పెరుగుతుందని... ఇది గుండె ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే అలారంకు వెంటనే రియాక్ట్ కాకుండా..

Update: 2024-09-18 15:11 GMT

దిశ, ఫీచర్స్: అలారం సౌండ్ కారణంగా రక్తపోటు, హృదయ స్పందన రేటు అకస్మాత్తుగా పెరుగుతుందని... ఇది గుండె ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే అలారంకు వెంటనే రియాక్ట్ కాకుండా.. స్నూజ్ బటన్ నొక్కడం వలన హార్ట్ హెల్త్ సేఫ్ గా ఉంటుందని చెప్తుంది.

స్నూజ్ బెనిఫిట్స్

30 నిమిషాల వరకు తాత్కాలికంగా ఆపివేయడం నిద్ర మత్తు తగ్గిస్తుంది. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరపు సహజమైన మేల్కొలుపు ప్రక్రియను నియంత్రిస్తుంది.

అలారంతో నష్టాలు

అలారం ఒత్తిడి, ఆందోళనకు కారణం అవుతుంది. గుండె ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. కాబట్టి అలారం, స్నూజ్ వంటివి లేకుండా రోజూ ఒకే టైంకు నిద్రపోవడం, మేల్కోవడం చేయండి. ధ్యానం, యోగా, ప్రశాంతమైన కార్యకలాపాలతో రోజును ప్రారంభించామని సూచిస్తున్నారు నిపుణులు.

Tags:    

Similar News