రాత్రి పడుకునే ముందు ఈ పదార్థాలు అస్సలు తినొద్దు...

పడుకునే ముందు ఫుడ్ క్రేవింగ్స్ నేచురల్. కానీ ఏడు గంటలలోపే డిన్నర్ చేసేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎప్పుడు, ఏం తీసుకోవాలనేది పాటించనప్పుడు... ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని అంటున్న ఎక్స్ పర్ట్స్.. అర్ధరాత్రి అస్సలు తినకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పదార్థాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.

Update: 2024-09-18 17:23 GMT

దిశ, ఫీచర్స్ : పడుకునే ముందు ఫుడ్ క్రేవింగ్స్ నేచురల్. కానీ ఏడు గంటలలోపే డిన్నర్ చేసేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎప్పుడు, ఏం తీసుకోవాలనేది పాటించనప్పుడు... ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని అంటున్న ఎక్స్ పర్ట్స్.. అర్ధరాత్రి అస్సలు తినకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పదార్థాలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.

కెఫిన్

కాఫీ, టీ, కొన్ని సోడాలలో లభించే కెఫిన్.. మీ డైజెస్టివ్ సిస్టమ్ లో గంటల తరబడి ఉంటుంది. నిద్రపోయే సామర్థ్యాన్ని, నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

మద్యం

ఆల్కహాల్ ప్రారంభంలో మగతగా ఉన్నప్పటికీ.. స్లీప్ సైకిల్ కు అంతరాయం కలిగిస్తుంది. విచ్ఛిన్నమైన నిద్రకు దారితీస్తుంది.

హెవీ మీల్స్

పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం... అది కూడా లేట్ నైట్ తినడం.. జీర్ణవ్యవస్థను అసౌకర్యానికి గురి చేస్తుంది. గుండెల్లో మంట, నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

షుగర్ స్నాక్స్

షుగర్ అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవడం ఎనర్జీ స్పైక్, క్రాష్ కు కారణం అవుతుంది. నిద్ర పోయేందుకు లేదా స్లీప్ కంటిన్యూ అయ్యేందుకు అడ్డుపడుతుంది.

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్ గుండెల్లో మంట, అజీర్ణానికి కారణం అవుతాయి. నిద్రకు, విశ్రాంతి తీసుకునేందుకు అసౌకర్యం కలిగిస్తాయి.

Tags:    

Similar News