Avocado: రెగ్యులర్‌గా ఈ పండు తినండి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!!
ప్రతిరోజూ అవకాడో తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ అవకాడో తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. ఆవకాడో(Avocado) ఆరోగ్యానికి మేలు చేసే పండు. సాధారణంగా మార్కెట్‌లో దొరికే ఈ పండు పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి(Bacterial growth) చెందడానికి మేలు చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని(Heart problems) తగ్గిస్తుంది. దీనిలో ఉండే విటమిన్లు(Vitamins), ఖనిజాలు(Minerals), ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ (Fiber) హార్ట్‌ను హెల్తీగా ఉంచుతాయి. కాగా ఆహారంలో అవకాడోను చేర్చుకోవడం మంచిది.
చెడు కొలెస్ట్రాల్(bad cholesterol)ను తగ్గించడంలో మేలు చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ పండు తింటే ప్రయోజనం చేకూరుతుంది. చెడు కొలెస్ట్రాల్ ధమనుల గోడల్లో ఫలకాన్ని నిక్షేపిస్తుంది. దీంతో బ్లడ్ సర్కులేషన్(Blood circulation) ఆగిపోతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాకుండా నొప్పులు(pains), వాపు(swelling)ను తగ్గించడంలో, అధిక బరువు(overweight) తగ్గించడంలోను ఆవకాడో పండు మేలు చేస్తుంది. గర్భధారణలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ పండు తింటే స్టమక్ ఎక్కువసేప నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఆకలిని నియంత్రించి.. వెయిట్ తగ్గించడంలో మేలు చేస్తుంది. అధిక పీచు, పోషకాలతో నిండిన ఆవకాడో ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో తింటే మంచిది పాలిచ్చే కొత్త తల్లులు కూడా ఈ పండు తీసుకుంటే మేలు. ఫోలేట్(Folate), విటమిన్ సి(Vitamin C), పొటాషియం(Potassium) వంటివి ఆవకాడోలో పుష్కలంగా ఉంటాయి. డెలివరీ తర్వాత తల్లి పాల ఉత్పత్తి(Milk production)ని పెంచడంలో ఆవకాడో ఎంతో సహాయపడుతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Dry fruits: డ్రైఫ్రూట్స్ స్టోర్ చేసే విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా..!!