వెస్ట్రన్ డైట్‌తో పెరుగుతున్న రిస్క్.. కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం!

వెస్ట్రన్ డైట్ తీసుకోవడంలో కంఫర్ట్ ఉండవచ్చు కానీ అది ఆరోగ్యానికి ప్రమాదకరమని అమెరికన్ ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

Update: 2024-06-10 13:31 GMT

దిశ, ఫీచర్స్ : వెస్ట్రన్ డైట్ తీసుకోవడంలో కంఫర్ట్ ఉండవచ్చు కానీ అది ఆరోగ్యానికి ప్రమాదకరమని అమెరికన్ ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో అధిక కొవ్వు, తక్కువ ఫైబర్ కంటెంట్ ఉండటం మూలంగా కొలొరెక్టర్ లేదా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వచ్చే అవకాశం ఉందని వారు కనుగొన్నారు. ఏటా 30 లక్షల మందికిపైగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం మంది దీని బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

కొలొరెక్టల్ క్యాన్సర్ అంటే ?

ఇది శరీరంలోని పెద్దపేగులో సంభవిస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఇది చివరి భాగం. ఆహారంలోని పోషకాలను శోషించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నీరు, పొటాషియం, కొవ్వులు, విటమిన్లను గ్రహించి శరీరానికి అందిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారాలు కొన్నిసార్లు పెద్దపేగుపై ఎఫెక్ట్ చూపుతాయి. ఈ నేపథ్యంలోనే కొలెరెక్టల్ లేదా పెద్దపేగు క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మలద్వారం దగ్గర విపరీతమైన నొప్పి, బ్లడ్ రావడం, బరువు తగ్గడం, అలసట వంటివి దీని లక్షణాలు.

నివారణ సాధ్యమేనా?

ఆహారంలో డైటరీ ఫైబర్‌ను చేర్చుకోవడం పెద్ద పేగు, అన్నవాహిక, పురీషనాళాన్ని ప్రభావితం చేసే వివిధ క్యాన్సర్ల రిస్క్ తగ్గుతుంది. రోజువారీ ఆహారంలో నారింజ, యాపిల్స్, నట్స్, తృణధాన్యాలు వంటివి తీసుకోవడం గట్ ఆరోగ్యానికి మంచిది. మహిళలు డైలీ 25 గ్రాములు, పురుషులు 40 గ్రాములు ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ నివారణగా ఉపయోగపడుతుంది. 


Similar News