sorrel leaves: ఈ ఆకుకూర రోజూ తీసుకుంటే ఆ అనారోగ్య సమస్యలన్నీ పరార్..!
ఆకు కూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు కూడా అంటున్నారు
దిశ, ఫీచర్స్ : ఆకు కూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. వీటిలో గోంగూర కూడా ఒకటి. ఈ ఆకుకూరల్లో గోంగూర ఒకటి. దీనినే కొందరు పుంటికూర అంటారు. ఈ గోంగూరతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఎక్కువగా పప్పు చేసుకుని తింటారు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైనది కూడా.. దీనిని రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గోంగూరలో ఔషధ గుణాలున్నాయి. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. గోంగూర ఆకులను తీసుకుని వాటిపై ఆముదం రాయాలి. వీటిని బాగా వేడి వేసి గాయాలు ఉన్న చోట కట్టు కట్టాలి. ఇలా చేయడం వలన నొప్పి, వాపు తగ్గుతుంది.
గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది బరువు తగ్గడానికి కూడా దారి తీస్తుంది. అలాగే జుట్టు మందంగా మారుతుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన రోజు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా దగ్గు, తుమ్ములతో బాధ పడేవారు గోంగూరను తింటే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.