మొలకలొచ్చిన వెల్లుల్లిపాయలు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనలో చాలా మంది వెల్లుల్లిని తింటూ ఉంటారు.

Update: 2024-06-27 07:11 GMT

దిశ, ఫీచర్స్: వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనలో చాలా మంది వెల్లుల్లిని తింటూ ఉంటారు. అయితే వెల్లుల్లి పాయ మొలక వస్తే మాత్రం పారేస్తూ ఉంటాం. వీటిలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలామంది మొలక వచ్చిన వెల్లుల్లిని పారేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే విషయాలను తెలుసుకుంటే అస్సలు పారేయరు.

ఇలా మొలక వచ్చిన వెల్లుల్లిపాయలో మామూలు వెల్లుల్లిపాయలో కన్నా ఎక్కువ గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ క్రియాశీలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లేత పాయలు, కాస్త ముదిరిన పాయలతో పోలిస్తే మొలక వచ్చిన పాయలలో రకరకాల మెటాబోలెట్స్ అధికంగా ఉంటాయి.

సాధారణంగా ఈ మెటాబోలెట్స్ గింజల మొలకల్లో కనిపిస్తాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబోలెట్స్ కాపాడతాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా అద్భుతంగా పనిచేస్తాయి. మామూలు వెల్లుల్లి పాయలు కన్నా మొలక వచ్చిన వెల్లుల్లి గుండెకు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, బిపి ను తగ్గించడంలో సహాయ పడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఇలా తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి మొలక వచ్చిన వెల్లుల్లిని తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Similar News