రోజ్‌మెరీ లీవ్స్‌తో హెర్బల్ టీ.. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే?

ఇప్పుడు ఎక్కడ చూసిన రోజ్‌మెరీ లీవ్స్ గురించే వినిపిస్తుంది.

Update: 2024-07-01 15:59 GMT

దిశ, సినిమా: ఇప్పుడు ఎక్కడ చూసిన రోజ్‌మెరీ లీవ్స్ గురించే వినిపిస్తుంది. జుట్టు పెరుగుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్ ఈ రోజ్‌మెరీ ఆకులతో ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. సన్నటి ఈనెల్లాంటి ఆకులతో.. గాఢమైన పరిమళాన్ని పంచే రోజ్‌మెరీ మొక్క.. పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్న పొద ఇది. దీన్ని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటల్లో, బ్రెడ్ సూప్స్ తయారీలో, సలాడ్స్‌లోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇక దీనికి టీ తయారు చేసుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చట. అంతే కాకుండా ఈ రోజ్‌మెరీ హెర్బల్ టీ కారణంగా అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రోజ్‌మెరీ మొక్క బూడిద రంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదుల్లాంటి సన్నని ఆకులతో, సువాసన గల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తు వరకు పెరిగే చిన్న పొద ఇది. నీరు నిలవని ఇసుక నేలల్లో, చల్లటి వాతావరణంలో పెరుగుతుంది. ఈ మొక్క కొమ్మలకు ఆరోగ్య ప్రయోజనాలెక్కువట. అందుకే వీటితో చేసే హెర్జల్‌టీ తాగమంటున్నారు పోషకాహార నిపుణులు. తాజా రోజ్‌మెరీ ఆకులతో పాటు ఎండిన వాటితో టీ తయారు చేసుకుని తాగొచ్చు.

ఇందులోని యాంటీ ఆక్సిడెండ్లు, ఫాలీఫెనాల్స్ జీర్ణశక్తికి తోడ్పడి ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ వంటివి అదుపు చేస్తాయి. జీవక్రియల్ని వేగాన్ని పెంచుతాయి. అంతేకాదు, అతిగా తినే అలవాటుతో పాటు బరువుని తగ్గించే గుణాలు దీనికి ఉన్నాయి. రోజ్‌మెరీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లోని రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్ చాలా శక్తివంతమైనవి. ఇవి శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. దాంతో వ్యాధుల ముప్పూ తగ్గుతుంది. ఈ మూలికా మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం.ఒంట్లోని వాపుల్నీ తగ్గించే సుగుణాలు ఇందులో ఉన్నాయి. నొప్పుల్నీ నియంత్రిస్తాయి. దీని టీ తాగితే హాయిగా నిద్రా పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

నోట్: పైన ఇచ్చిన సమాచారం పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చినది మాత్రమే.

Similar News