బ్రెడ్ ప్యాకెట్ ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా.. దీనిపై నిపుణుల అభిప్రాయం ఏమిటంటే?

ప్రతి ఒకరి ఇంట్లో తప్పకుండా బ్రెడ్ ప్యాకెట్ అనేది ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకు ఉదయం లేవగానే చాలా మంది టీలో బ్రెడ్ పెట్టుకొని తింటుంటారు. అయితే చాలా మంది బ్రెడ్ ప్యాకెట్స్‌ను,

Update: 2024-07-03 16:16 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒకరి ఇంట్లో తప్పకుండా బ్రెడ్ ప్యాకెట్ అనేది ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకు ఉదయం లేవగానే చాలా మంది టీలో బ్రెడ్ పెట్టుకొని తింటుంటారు. అయితే చాలా మంది బ్రెడ్ ప్యాకెట్స్‌ను, బన్‌లను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఫ్రిజ్‌లో బ్రెడ్ పెట్టవచ్చా? లేదా? దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారో, ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్‌ను అస్సలే ఫ్రిజ్‌లో పెట్టకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన బ్రెడ్ తినడం వలన కఫం వంటి సమస్యలు వస్తాయంట. అంతే కాకుండా, బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వలన దాని రుచి, వాసన అన్నీ కోల్పోయి త్వరగా ఎండిపోతుందంట. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రత బ్రెడ్ త్వరగా ఎండిపోయేలా చేస్తుందంట. అందు వలన దీనిని ఫ్రిజ్‌లో పెట్టకుండా గాలి చొరబడి బాక్స్‌లో పెట్టడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ చాల మందిబ్రెడ్ తీసుకొచ్చాక వెంటనే ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే ఫ్రిజ్‌లో పెట్టిన బ్రెడ్‌ను ఓవెన్‌తో కొద్ది సేపు వేడి చేసి తినడం మంచిదంట. దీని వలన ఎలాంటి సమస్యలు దరిచేరవు.


Similar News