8 ఆకారంలో వాకింగ్ చెయ్యడం వల్లే కలిగే లాభాలు ఏంటో తెలుసా?

నడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.

Update: 2024-07-01 14:22 GMT

దిశ, ఫీచర్స్: నడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. రోజు వాకింగ్ చెయ్యడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే.. బరువు తగ్గడంతో పాటు చర్మం కూడా యవ్వనంగా మారుతుంది. ఇక చాలా మంది ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తుంటారు. అయితే.. 8 సంఖ్య ఆకారంలో నడిస్తే రెట్టింపు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ 8 సంఖ్య ఆకారంలో నడవటాన్ని ఇన్ఫినిటీ వాక్ అని కూడా అంటారు. దీనివల్ల వేగంగా బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఆకృతిలో వాక్ చెయ్యడం వల్ల శరీర భాగాలు, కండరాలన్నీ కదిలి.. కొవ్వు సులభంగా కరుతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆకారంలో నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. అంతే కాకుండా ఒత్తిడి తగ్గి రక్తపోటు అదుపులో ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.  

Similar News