Valentine's Day : సింగిల్ అని బాధపడుతున్నారా.. ఇలా ఎంజాయ్ చేయండి!
ప్రేమికుల రోజు.. నేడు చాలా మంది యువతీ,యువకులు సంతోషంలో మునిగిపోతున్నారు. తమ ప్రేమ ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలైంది దాని గురించి గుర్తు చేసుకుంటూ.. వాలెంటైన్స్ డేను ఎంజాయ్ చేస్తారు
దిశ, ఫీచర్స్ : ప్రేమికుల రోజు.. నేడు చాలా మంది యువతీ,యువకులు సంతోషంలో మునిగిపోతున్నారు. తమ ప్రేమ ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలైంది దాని గురించి గుర్తు చేసుకుంటూ.. వాలెంటైన్స్ డేను ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ రోజు ఏ పార్క్స్, హోటల్స్, రెస్టారెంట్స్ చూసినా ప్రేమికులే కనిపిస్తుంటారు. ఇక ప్రేమికులను చూసిన సింగిల్స్ మాత్రం కాస్త బాధపడుతుంటారు. ప్రేమ విఫలమై ఒంటరిగా ఉండేవారు, అసలు ప్రే వద్దూ అనుకునే వారు ఒంటరిగా ఉంటారు. అయితే వారు అనుకుంటుంటారు ప్రేమికులు మాత్రమే వాలెంటైన్స్ డే జరుపుకుంటారు అని. కానీ ప్రేమికులు మాత్రమే కాదండోయ్.. సింగిల్స్ కూడా ఈరోజును జరుపుకోవచ్చు అంట, అది ఎలా అంటే?
ఒకవేళ మీరు సింగిల్ అయితే మీకు నచ్చిన మీ స్నేహితులను ఇంటికి రమ్మని లేదా ఏదైనా మీకు నచ్చిన ప్లేస్‌లో కలుసుకొని ముచ్చటించుకోండి. అలాగే ఈ వాలెంటైన్స్ డే మీకు మరింత స్పెషల్‌గా ఉండాలి అనుకుంటే,మీకు లాగే సింగిల్‌గా ఉన్నవారి ఆనందం కోసం ఏమైనా చేయాలనుకుంటే డిన్నర్ ప్లాన్ చేయండి. సింగిల్స్ అందరిని పిలిచి డిన్నర్ ఇవ్వండి. అందరూ ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో మీకు నచ్చిన వ్యక్తికి బహుమతి లేదా చాక్లెట్ కొనివ్వండి, మీ ఫ్యామిలీతో ఈరోజు చాలా సరదాగా గడపండి. వీలైతే మీ సింగిల్స్ అందరూ కలిసి మంచి సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేయండి. ఇలా చేయడం వలన మీరు ఈరోజు ప్రేమికుల దినోత్సవమనే మర్చిపోతుంటారు.