ల్యాప్‌టాప్‌ను అక్కడ పెట్టుకొని వాడితే స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు !
వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ పెరిగిన తర్వాత చాలామంది ల్యాప్‌టాప్‌లను వాడుతున్నారు.
దిశ, ఫీచర్స్ : వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ పెరిగిన తర్వాత చాలామంది ల్యాప్‌టాప్‌లను వాడుతున్నారు. కొందరు తాము ఎక్కడికెళ్లినా వీటిని తీసుకెళ్లి, వీలు దొరికినప్పుడల్లా పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తుంటారు. ఇక పిల్లలైతే ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని మూవీస్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడంలో పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు కానీ, ల్యాప్‌టాప్ వాడే విధానం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
చెయిర్‌లోనో, బెడ్‌పైనో కూర్చొని ల్యాప్ టాప్‌ను తొడలపై పెట్టుకుని చూడటం లేదా వర్క్ చేయడం వల్ల అసలు సమస్య మొదలవుతుంది. తొడలపై లేదా కాళ్లమీద పెట్టుకుని యూజ్ చేయడంవల్ల ల్యాప్‌టాప్ స్ర్కీన్ నుంచి వెలువడే రేడియేషన్‌తో స్త్రీ, పురుషుల్లో చర్మ సమస్యలు, సంతాన లేమి సమస్యలు తలెత్తవచ్చు. పురుషుల్లో అయితే ల్యాప్‌టాప్ ఎక్కువసేపు వాడటంవల్ల వెలువడే రేడియేషన్, వేడి కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ సమస్యలు ఏదో కొద్దిసేపు వాడటంవల్ల అయితే రావు.
గంటలకొద్దీ వాడినప్పుడు, ల్యాప్‌టాప్ అధికంగా వేడెక్కినప్పుపడు, దాని నుంచి 4 నుంచి 5 డిగ్రీల వేడిలో ప్రొడ్యూస్ అయితే ఈ పరిస్థితికి దారితీస్తుంది. దీంతోపాటు తొడలమీద ఎక్కువసేపు పెట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే మెడలు, వెన్ను టర్న్ చేస్తుంటాం. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతాయి. దగ్గర నుంచి తరచూ చూస్తుంటాం కాబట్టి బ్లూ లైట్ రిఫ్లెక్ట్‌కు ఎక్కువగా గురవడంవల్ల కంటి సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త పడకపోతే, నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే ల్యాప్ టాప్‌ను సరైన పద్ధతిలో యూజ్ చేయాలని, ఒకవేళ తొడలపై పెట్టుకుని వాడాల్సిన పరిస్థితి ఉన్నవారు యాంటీ రేడియేషన్ ప్యాడ్స్‌ను వాడితే మంచిదని నిపుణులు చెప్తున్నారు.
Also Read.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక: ఈ యాప్స్ వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి!