శుభవార్త : HIV వ్యాక్సిన్ పై పరిశోధకుల ప్రకటన.. వారం రోజుల్లోనే చెక్ పెట్టేలా.. ఫుల్ డిటైల్స్...

ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల మందికి పైగా HIV బారిన పడుతున్నారు. సరైన యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్క వ్యాక్సిన్ ఈ బాధలకు బై బై చెప్పేస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు MIT పరిశోధకులు.

Update: 2024-09-23 16:17 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల మందికి పైగా HIV బారిన పడుతున్నారు. సరైన యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్క వ్యాక్సిన్ ఈ బాధలకు బై బై చెప్పేస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు MIT పరిశోధకులు. నిజానికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ తయారీలో విఫలం అయ్యేందుకు కారణం వైరస్ తరుచుగా మ్యూటేట్ కావడం. కాగా ఇలా పరివర్తన జరిగినా వ్యాక్సిన్ వర్క్ చేసేందుకు... స్ట్రాంగ్ సొల్యూషన్ తో వచ్చినట్లు చెప్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో బెస్ట్ రిజల్ట్ వచ్చిందని తెలిపారు.

వారం వ్యవధిలో వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు సైంటిస్టులు. మొదటి డోస్ రోగ నిరోధక శక్తిని ప్రైమ్ చేస్తుందని.. సెకండ్ డోస్ కు శక్తివంతంగా ప్రతిస్పందించేలా తయారు చేస్తుందని చెప్పారు. ఈ సమర్థవంతమైన టీకా వైరస్ ను పూర్తిగా నిరోధిస్తుంది. కాగా క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న ఆశాజనక వ్యాక్సిన్‌లో ఎన్వలప్ ట్రిమర్ అని పిలువబడే HIV ప్రోటీన్, SMNP అనే నానోపార్టికల్ ఉన్నాయి. ఇర్విన్ ల్యాబ్ నానోపార్టికల్ డెవలప్ చేయగా.. ఇది వ్యాక్సిన్ కు బలమైన B సెల్ ప్రతిస్పందనను నియమించడంలో హెల్ప్ చేస్తుంది. ముందుగా వ్యాక్సిన్ 12 డోసులు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసిన శాస్త్రవేత్తల బృందం.. ప్రస్తుతం రెండు డోసులతో పరిష్కరించవచ్చని తెలిపారు. ఫస్ట్ డోస్ 20 శాతం ఇవ్వనుండగా.. రెండోది 80 శాతంగా ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News