Healthy Fruits : వింటర్‌లో దగ్గు, కఫం వేధిస్తున్నాయా..? ఇవి తింటే దెబ్బకు పరార్ !

Healthy Fruits : వింటర్‌లో దగ్గు, కఫం వేధిస్తున్నాయా..? ఇవి తింటే దెబ్బకు పరార్!

Update: 2024-11-21 06:35 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే చలికాలంలో దగ్గు, జ్వరం, కఫం, గొంతు నొప్పి వంటి సీజనల్ అనారోగ్యాలు (Seasonal illnesses) పలువురిని వేధిస్తుంటాయి. పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా నివారణ చర్యలుపాటించడం వంటివి చేస్తే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీటితోపాటు ఈ సీజన్‌లో మాత్రమే అధికంగా లభించే పుల్లని, తియ్యని రుచి కలిగిన పండ్లు తినడంవల్ల రోగ నిరోధక శక్తిని (Resistive power) పెంచుతాయి. తద్వారా వ్యాధుల ప్రభావాన్ని ఎదుర్కోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అవేమిటి? ఎలా పనిచేస్తాయో చూద్దాం.

వింటర్‌లో ఎక్కువగా లభించే పండ్లలో నారింజ (Orange), నల్ల ద్రాక్ష కూడా ఒకటి. అసలే కూల్ వెదర్. ఇలాంటప్పుడు వీటిని తింటే జలుబు చేస్తుందని, దగ్గు, కఫం వంటివి అధికం అవుతాయని కొందరు భావిస్తుంటారు. కానీ అలాంటిదేమీ జరగదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పైగా నారిజంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. నల్ల ద్రాక్షలోనూ ఇవి ఉంటాయి. పైగా వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి జలుబు, గొంతు నొప్పి, కఫం, దగ్గు (Sore throat, phlegm, cough) వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వీటిలోని ఫ్లేవనాయిడ్లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి. నారింజలో ఉండే ఫైబర్ కంటెంట్ (Fiber content) వల్ల అధిక బరువు తగ్గుతారు. సో.. చలికాలంలో ఈ పండ్లను తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ‌’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News