ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోయే అలవాటు ఉందా..? ఇది తెలుసుకోండి!

శీతాకాలంలో చాలామంది చలి కారణంగా లేదా దోమలు కారణంగా కానీ ఫుల్‌గా దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటారు.

Update: 2024-12-03 12:52 GMT

దిశ, ఫీచర్స్: శీతాకాలంలో చాలామంది చలి కారణంగా లేదా దోమలు కారణంగా కానీ ఫుల్‌గా దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల వెచ్చగా ఉంటుందని అనుకుంటారు. మరికొందరు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దుప్పటిని నిండుగా కప్పుకునే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ, ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ముఖం కూడా కనిపించకుండా ఫుల్‌గా దుప్పటి కప్పుకోవడం వల్ల మూత్ర పిండాలను హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై దుప్పటి కప్పుకోవడం వల్ల కార్బన్ డై యాక్సైడ్‌, ఆక్సిజన్ మార్పిడికి అడ్డం కలుగుతుంది. దీంతో కార్బన్ డై ఆక్సైడ్‌నే మళ్లీ పీల్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులకు గాలి సరిగా అందదు. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి.

* దుప్పటిని కాళ్ల నుంచి ఫేస్ వరకు ఫుల్‌గా కవర్ చేసుకుని నిద్రపోవడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. దుప్పటి కప్పుకోవడం వల్ల శరీరానికి గాలి సరిగా తగలదు. మీరు వదిలే కార్బన్ డై యాక్సైడ్ కూడా బయటికి పోకుండా దుప్పటిలోనే ఉంటుంది. అదే గాలిని మళ్లీ పీల్చడం వల్ల చర్మం రంగుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా చర్మంపై ముడతలు, పింపుల్స్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.

* దుప్పటి ముఖంపై కప్పకోవడం వల్ల కార్బన్ డై యాక్సైడ్ లెవల్స్ పెరిగిపోయి ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. ఇది మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా శరీరంలోని భాగాలకు రక్తప్రసరణ కూడా తగ్గుతుంది.

* ఫుల్‌గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల శరీరం త్వరగా వేడెక్కుతుంది. దీని వల్ల బాడీ మొత్తం చెమటలు పట్టి నిద్ర మధ్యలోనే మెలకువ వస్తుంది.

* ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఆక్సిజన్ అందక గుండెపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. తల తిరగడం వికారం వంటివి కూడా రావొచ్చు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.

Read More:   Self mistakes : స్వీయ తప్పిదాలు.. లైఫ్ క్వాలిటీని తగ్గిస్తున్న డైలీ రొటీన్స్! 

Tags:    

Similar News