Bird-inspired robotic : పక్షిలా ఎగిరే రోబోట్ కూడా వచ్చేసిందోచ్..!

Bird-inspired robotic : పక్షిలా ఎగిరే రోబోట్ కూడా వచ్చేసిందోచ్..!

Update: 2025-04-10 07:43 GMT
Bird-inspired robotic : పక్షిలా ఎగిరే రోబోట్ కూడా వచ్చేసిందోచ్..!
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : మనుషుల్ని అనుకరించే రోబోట్స్ గురించి తెలిసిందే. ఇటీవల గుర్రంలా పరుగెత్తే ఏఐ రోబోట్స్ సైతం వచ్చేశాయి. కానీ పక్షిలా ఎగిరే రోబోట్‌ను చూశారా? ప్రస్తుతం అది కూడా వచ్చేసింది. నిజానికి టెక్నాలజీ ఇప్పుడు మరింత డెవలప్ అవుతూ అద్భుతాలు చేస్తోంది. అనేక విషయాల్లో మానవులకు సౌకర్యంగా మారుతోంది. అదే పక్షిలా ఎగిరే (Bird-inspired robotic drone) రోబోటిక్ డ్రోన్!

డ్రోన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, అవి మరీ ఎక్కువ దూరం వెళ్లలేవు. కొన్ని వెళ్లినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. ఎగురుతున్నప్పుడు ఏ చెట్టో పుట్టో అడ్డు వస్తే కిందపడిపోతాయి. కానీ అలాంటి ఆటంకాలను సైతం అధిగమిస్తూ నిర్దేశిత గమ్యాన్ని పక్షిలా ఎగిరే రోబోటిక్ డ్రోన్‌ను కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ (Stanford University) ఇంజినీర్లు కట్ కోస్కీ అండ్ డేవిడ్ లెంటింక్ డెవలప్ చేశారు. కాగా “Stereotyped nature-inspired aerial grasper is a snag(SNAG)” అని పిలువబడే ఈ అధునాతన రోబోటిక్ డ్రోన్‌ను తయారు చేయడానికి వారు అనేక సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. ఫైనల్లీ పక్షిలా చెట్లపై కూర్చోవడం, గాలిలో ఎగరడం, వస్తువులను మోసుకెళ్లడం వంటి పనులు చేయగల బర్డ్ ఇన్‌స్పైర్డ్ రోబోటిక్ డ్రోన్‌ (Bird-inspired robotic drone)ను ఆవిష్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలోవైరల్‌ అవుతోంది. 

 * Click this link for the video : https://www.instagram.com/reel/DIMi7XaSEIQ/?utm_source=ig_web_copy_

Tags:    

Similar News