Health Tips : భోజన సమయంలో నీళ్లు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుంది?

Health Tips : భోజన సమయంలో నీళ్లు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుంది?

Update: 2024-10-14 12:36 GMT

దిశ, ఫీచర్స్ : అన్నం తినేటప్పుడు గానీ, తిన్న వెంటనే గానీ నీళ్లు ఎక్కువగా తాగవద్దని పెద్దలు చెప్తుంటారు. నిపుణులు కూడా అదే అంటున్నారు. ఈ సమయంలో ఎక్కువగా తాగడంవల్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే యాసిడ్స్ గుణాలు, ఎంజైమ్‌లు బలహీన పడతాయని చెప్తున్నారు. అందుకే తక్కువ మోతాదులో నీరు తాగాలని సూచిస్తున్నారు.

తిన్న వెంటనే మరీ ఎక్కువగా నీరు తాగడం అనేది శరీరంలో వాపు, నొప్పి వంటి సమస్యలను పెంచుతుంది. ఎందుకంటే ఆ సమయంలో అధిక నీరు బాడీలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి నిదానంగా మాత్రమే తాగాలి. కొన్నిసార్లు భోజనం చేసిన వెంటనే వేగంగా నీరు తాగడంవల్ల వాటర్ పాయిజన్‌కు దారితీయవచ్చు. దీంతో తలనొప్పి, గందరగోళం తలెత్తుతాయి. అలాగనీ నీళ్లు తక్కువగా తాగడం మంచి కాదు. కేవలం భోజనం చేస్తున్న సమయంలో, ఆ వెంటనే మాత్రమే తక్కువ తాగాలి. మిగతా సమయాల్లో అవసరం మేరకు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయకపోతే కూడా శరీరంలో నీటి శాతం తగ్గి మైకం, అలసట, డీహైడ్రేషన్, తలనొప్పి, కండరాల నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

*నోట్:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడంలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News