Fitness: గ్రూప్ వర్కౌట్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు..!
ఫిట్(fitness)గా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా అవసరం.
దిశ, ఫీచర్స్: ఫిట్(fitness)గా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా అవసరం. ప్రతీ రోజూ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. అయితే, ఈ వ్యాయామం ఒంటరిగా కాకుండా గ్రూప్‌గా చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఫ్యామిలీ, స్నేహితులు, మీకు ఇష్టమైన వారితో కలిసి వర్కౌట్స్ చేయడం వల్ల ఆ రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఈ గ్రూప్ ఎక్సర్‌సైజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక ఆరోగ్యం: గ్రూప్‌గా కలిసి వర్కౌట్స్ చేయడం వల్ల ఎక్కువ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఒత్తిడి, అసలట, ఆందోళన వంటివి దరిచేరవు. స్నేహితులతో కలిసి వ్యాయామం చేస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది. దీంతో మైండ్ కూల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రోగ్రెస్ విషయంలో ఇతరులతో ఎప్పటికీ పోల్చుకోకూడదు.
పరిచయాలు: ఒక చోట అందరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడతాయి. దీని వల్ల ఒకరి ఫిట్‌నెస్ విషయాలు, గోల్స్, సలహాలు, సూచనలు వంటివి తెలుసుకోవచ్చు. దీంతో, గ్రూప్‌లో స్నేహబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత జీవితంలోనూ ఇది చాలా ఉపయోగపడుతుంది.
మోటివేషన్: ఒక బృందంలా మారి ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల పట్టుదల పెరుగుంది. లక్ష్యానికి అనుగుణంగా వ్యాయామం చేయాలని అనిపిస్తుంది. చుట్టూ అందరూ వర్కౌట్స్ చేస్తుంటే మోటివేషన్ అధికమవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా వ్యాయామం చేయాలని అనిపించక బద్ధకంగా ఉన్నట్లైతే, ఎవరో ఒకరు మోటివేట్ చేసి వ్యాయమం చేసేలా చేస్తారు.
ఇన్‌స్ట్రక్టర్: గ్రూప్‌గా చేరి వ్యాయామం చేస్తున్నప్పడు ఓ ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించుకోండి. ఇలా చేయడం వల్ల గ్రూప్ సభ్యులకు వర్కౌట్స్ చేయడానికి సులభంగా ఉంటుంది. అందరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల త్వరగా వర్కౌట్స్ (workout) అలవాటుగా మారుతాయి.