Reading Skills : గుడ్ రీడింగ్ స్కిల్స్‌ ఉన్నవారి బ్రెయిన్ డిఫరెంట్‌గా ఉంటుంది..? కారణం ఇదే

Update: 2024-12-11 09:13 GMT

దిశ, ఫీచర్స్: చదువంటే కేవలం బట్టీ పట్టి చదవడం సరైంది కాదు. నిజానికి ఇలాంటి చదువువల్ల ఉపయోగం లేదంటున్నారు నిపుణులు. అప్పటి పూర్తికి మార్కులు పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో మాత్రం సహాయపడదు. పైగా బట్టీ పట్టిన విషయాలు సుదీర్ఘకాలం గుర్తుండవు. అదే ఆసక్తికొద్దీ.. అవగాహన చేసుకుంటూ చదవడం, సరదాగా చదవడం వంటివి జీవితాంతం గుర్తుంటాయి. అయితే ప్రస్తుతం ఇలా చదివే వారి సంఖ్య పడిపోతోందని యూకేకు చెందిన రీడింగ్ ఏజెన్సీ అధ్యయనంలో వెల్లడైంది. పైగా అడల్ట్స్‌లో 50 శాతం మంది రెగ్యులర్‌గా చదవడం లేదు. అవసరం కోసం బట్టీ పడుతున్నారు. అలాగే 16 నుంచి 24 ఏండ్ల వయస్సు గల ప్రతీ నలుగురిలో ఒకరు సరైన రీడర్స్‌గా ఉండటం లేదు.

చదువులో స్కిల్స్ ఎలా అలవడుతాయి? ఎలా చదివితే బాగా గుర్తుంటుంది అనే విషయాలను తెలుసుకోవడానికి యూకే రీడింగ్ ఏజెన్సీ పరిశోధకులు 1000 మందిని పరిశీలించారు. వారికి సంబంధించిన ఓపెన్ సోర్స్ డేటాను విశ్లేషించారు. బట్టీ పట్టి చదవడం కంటే సరదాగా చదవడం, చూస్తూ చదవడం, వీడియోలను వినడం వంటివి మెదడుపై కాస్త సానుకూల ప్రభావాన్ని కలిగిస్తున్నట్లు గుర్తించారు. కాగా ఈ సందర్భంగా వారు బ్రెయిన్ అనాటమీలో విభిన్న సామర్థ్యాలున్న రీడర్స్ విభిన్న లక్షణాలను కూడా కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. న్యూరో ఇమేజ్‌లో పబ్లిషైన ఈ కొత్త అధ్యయన వివరాల ప్రకారం.. చదువులో నైపుణ్యం కలిగి ఉంటున్నవారి మెదడు భాగాన్ని పరిశీలించినప్పుడు పలు ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి.

గుడ్ రీడర్స్ బ్రెయిన్ ఎడమ అర్ధగోళంలో ( left hemisphere) భాషకు సంబంధించిన కీలకమైన రెండు ప్రాంతాల నిర్మాణం ఉంటుంది. చదవులో నైపుణ్యం కలిగి ఉన్న వ్యక్తులలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాటిలో ఒకటి టెంపోరల్ లోబ్ (temporal lobe) పూర్వ భాగం. కాగా ఇది వివిధ రకాల అర్థవంతమైన సమాచారాన్ని గ్రహించడానికి, వర్గీకరించడానికి సహాయపడుతుంది. దృశ్య (visual,), ఇంద్రియ(sensory), మోటార్ ఇన్ఫర్మేషన్‌ను అనుబంధానించడంలో కీ రోల్ పోషిస్తుంది. ఇక రెండవది హెచ్స్‌ల్స్ (Heschl’s) గైరస్. ఇది మెదడు బయటి పొరను(శ్రవణ వల్కలం)హోస్ట్ చేసే ఎగువ టెంపోరల్ లోబ్‌పై ఉండే మడత వంటి భాగం. కుడివైపు భాగంతో పోలిస్తే ఎడమ అర్ధగోళంలోని ఈ టెంపోరల్ లోబ్ మెరుగైన పఠన సామర్థ్యానికి దోహదం చేస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అంటే చదువులో, వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగి ఉండటంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో లోపం ఉన్నవారు కూడా నైపుణ్యాలకు సంబంధించిన ఇబ్బందులు, చదివింది గుర్తుండకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

*నోట్ :పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News