Free Vine: మందుబాబులకు గుడ్ న్యూస్.. ట్యాప్ తిప్పి గ్లాసులో పట్టుకుని ఫ్రీగా వైన్ తాగేయడమే..ఎక్కడంటే?

సాధారణంగా చాలా మంది ఏదైనా ఫెస్టివల్ లేదా ఎవరైనా ఇంటికి వస్తే మందు, విందు సౌకర్యాలు అందుబాటులో ఉంచుతారు.

Update: 2024-07-29 04:07 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా చాలా మంది ఏదైనా ఫెస్టివల్ లేదా ఎవరైనా ఇంటికి వస్తే మందు, విందు సౌకర్యాలు అందుబాటులో ఉంచుతారు. విందు లేకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ మందు లేనిదే ముద్ద కూడా దిగదు. మాట రాకుడదని వేలకు వేలు పెట్టి మరీ లిక్కర్ తీసుకొచ్చి పెడతారు. అలా మన దేశంలో కూడా లిక్కర్ ఆదాయం మీదే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ, ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ ట్యాప్‌లు ఉంటాయి. వాటిని తిప్పితే మద్యం వస్తుంది. దానిని గ్లాస్‌లో పట్టుకొని తాగేయడమే. అది కూడా డబ్బులు పెట్టి కాదండోయ్ ఫ్రీగానే.. ఏంటీ నిజమా అంటే అవుననే చెప్పాలి. మరి ఈ ఫ్రీ వైన్ దొరుకుతున్న ప్లేస్ ఎక్కడ.. అసలు ఫ్రీ వైన్ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందామా..

ఇటలీ దేశంలో విభిన్నమైన సేవలు అందించాలని ఇక్కడి ద్రాక్ష యజమానులు అప్పట్లో భావించారు. అందులో భాగంగానే ఫ్రీ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత రోమ్ నగరం నుంచి ఒర్టోనా వరకు 196 మైళ్ళ దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రతి ఏడాది సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేల మంది కేథలిక్‌లు పాల్గొంటారు. ఈ దారి వెంట ప్రయాణం సాగించే వారి దాహం తీర్చేందుకు ప్రసిద్ధ కామినో డి షాన్ టోమ్మాసో దగ్గర ఈ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ట్యాప్ తిప్పి తమకు కావలసినంత వైన్ తాగి ముందుకు వెళ్తారు. మరింత కావాల్సిన వాళ్ళు పెద్ద పెద్ద బాటిల్స్‌లో ఫిల్ చేసుకొని వెళ్తూ ఉంటారు. వాస్తవానికి దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు దొరకడమే గగనమైన ఈ రోజుల్లో ఇటలీ దేశంలో ఏకంగా రెడ్ వైన్ అందించడం.. అది కూడా ఫ్రీగా ఇవ్వడం గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే ద్రాక్ష తోట యజమానులు తమ ఎస్టేట్లో పండే పండ్లను ఈ వైన్ తయారీ కోసం వినియోగిస్తారు. వేలాది ఎకరాల్లో తోటలు విస్తరించిన నేపథ్యంలో బాగా పక్వానికి వచ్చిన పండ్లతో వారు ఈ వైన్ తయారు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి రసాయనాలు కలపకపోవడంతో.. వైన్‌ను క్యాథలిక్‌లు ఆస్వాదిస్తూ తాగుతుంటారు.

ఈ వైన్‌లో కేవలం గ్రేప్ జ్యూస్ మాత్రమే కలుపుతారు. అందువల్లే క్యాథలిక్‌లు ఇష్టంగా తాగుతుంటారు. దీనివల్ల సత్వర శక్తి లభిస్తుందని వారు నమ్ముతుంటారు. పైగా ఈ గ్రేప్స్‌ను ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా సహజ సిద్ధంగా పండించడం వల్ల.. వాటితో తయారు చేసే వైన్ అత్యంత టేస్టీగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ వైన్ తాగడం వల్ల శరీరం ఉత్తేజానికి గురవుతుందని.. ఎటువంటి రుగ్మతలు ఉన్నా మాయమవుతాయని క్యాథలిక్‌లు చెబుతుంటారు. కొందరైతే బాటిళ్లలో నింపుకొని తమకు ఇష్టమైన వారికి బహుమతిగా ఇస్తుంటారు. అయితే ఎంత స్థాయిలో వైన్ తాగినప్పటికీ ద్రాక్షతోట నిర్వాహకులు ఏమాత్రం అడ్డు చెప్పరు. మరి మీరు కూడా ఈ సారి ఇటలీ వెళ్లినప్పుడు ఈ ప్లేస్‌ను విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.

Tags:    

Similar News