Winter: చలికాలంలో భోజనం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
పదే పదే ఆహారం వేడి చేయడం వలన పోషకాలన్నీ నశిస్తాయి
దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. అలాంటి సమయంలో వెచ్చగా ఉండే దుస్తులను ధరించి బయటకు వెళ్తుంటారు. చలి కాలంలో ( winter ) వండుకున్న ఆహారం కూడా తొందరగా చల్లబడిపోతుంది. అలా అని పదే పదే ఆహారం ( Healthy food) వేడి చేయడం వలన పోషకాలన్నీ నశిస్తాయి. ఫుడ్ ఎక్కువ సేపు వేడిగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.
ఆహారాన్ని వేడిగా ఉంచడానికి అల్యూమినియం ఫాయిల్‌ని ఉపయోగిస్తాము. రోటీ, పరాఠాలను కూడా ఒక పేపర్ ర్యాప్‌లో చుట్టి ఒక కుండపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఉదయం చేసిన మధ్యాహ్నం వరకు వేడిగా ఉంటుంది.
చాలా మంది రోటీలను ఇష్టంగా తింటారు. వీటిని స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను ఎక్కువగా పెడుతుంటారు. వాటిలో రోటీని ఎక్కువసేపు వేడిగా ఉండదు. దాని కోసం ప్యాక్ చేసే ముందు బాక్స్‌పై కాటన్ క్లాత్, పైన హీటింగ్ ప్యాడ్ పెట్టుకుంటే ఎక్కువ సేపు వేడిగా ఉంటాయి. అలాగే, థర్మల్ బ్యాగ్స్ లో కూడా ఫుడ్ ని వేడిగా ఉంచొచ్చు. కాగితం, ప్లాస్టిక్ ఉపయోగించి స్వంత ఇన్సులేట్ బ్యాగ్‌ని తయారు చేసుకోవచ్చు. దీనిలో ఆహారం వేడిగా ఉంటుంది. అంతేకాకుండా, ఆహార పాత్రను ఆ బ్యాగ్‌లో ఉంచితే భోజనం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. శీతాకాలంలో ఇత్తడి పాత్రలు ఆహార నిల్వల కోసం మంచి ఎంపిక.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.