ఏంటీ ఆఫీస్ టైంలో పదే పదే నిద్రొస్తోందా.. ఇలా చేయండి!

నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం 8 గంటలు నిద్ర పోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అని చెబుతున్నారు వైద్యులు. రాత్రి నిద్ర పోవడం మంచిది. కానీ కొంత మందికి మధ్యాహ్నం

Update: 2024-02-16 09:21 GMT

దిశ, ఫీచర్స్ : నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం 8 గంటలు నిద్ర పోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అని చెబుతున్నారు వైద్యులు. రాత్రి నిద్ర పోవడం మంచిది. కానీ కొంత మందికి మధ్యాహ్నం అతిగా నిద్ర పోతుంటారు.మరీ ముఖ్యంగా ఆఫీస్ టైంలో ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. కొంత మంది రాత్రి సమయంలో సరిగా నిద్రపోక పోవడం వలన మధ్యాహ్నం నిద్ర వస్తే,మరికొంత మందికి ఆఫ్టర్ నూన్ తిన్న తర్వాత ఓ కునుకు తియాలనిపిస్తూ ఉంటుంది.

ఇక డ్యూటీ టైంలో నిద్ర రావడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్క్ చేయాలి అనిపించకపోవడం, వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వంటిది జరుగుతది. అంతే కాకుండా మన పై అధికారులు మనం ఆఫీసులో నిద్ర పోవడాన్ని గమనిస్తే జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆఫీస్ టైంలో నిద్ర రాకుండా జాగ్రత్త పడాలి. అయితే ఆఫీస్ టైంలో నిద్ర రాకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


  • ఆఫీసులో వర్క్ చేస్తున్న సమయంలో బోర్‌గా, డల్‌గా ఉండకూడదంట. చాలా యాక్టివ్‌గా పని చేయాలంట. పని చేస్తూ, అందరితో మాట్లాడుతూ వర్క్ చేయడం వలన నిద్రరాదు.

  • మీకు ఆఫీస్‌లో ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నప్పుడు.. రాత్రి పూట ఖచ్చితంగా నిద్ర పోయేలా చూడండి. నిద్ర కోసం ఓ షెడ్యూల్‌ని ఏర్పాటు చేసుకోండి. నిద్ర పోయే సమయంలో ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండండి. రాత్రి పూట 7 నుంచి 9 గంటలు నిద్రపోతే,ఉదయం రీఫ్రెష్‌గా ఉండొచ్చు. దీని వలన ఆఫీసులో నిద్రపోకుండా ఉంటారు.

  • మీరు వర్క్ చేసే డెస్క్ బాగుండేలా సూర్యకాంతి ఉండేలా చూసుకోవాలి. మధ్యహ్నం తిన్నాక కాస్త వాకింగ్ చేయడం లాంటిది చేయాలి.

Tags:    

Similar News