Watermelon : వేస‌వి కాలంలో పుచ్చ‌కాయను కచ్చితంగా తినాలంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా..!

వేస‌వి కాలంలో మ‌న‌కు దొరికే పండ్ల‌లో పుచ్చ‌కాయ

Update: 2025-03-23 03:09 GMT
Watermelon :  వేస‌వి కాలంలో పుచ్చ‌కాయను కచ్చితంగా తినాలంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : వేస‌వి కాలంలో మ‌న‌కు దొరికే పండ్ల‌లో పుచ్చ‌కాయ ( Watermelon )  కూడా ఒక‌టి. దీనిలో విటమిన్ ఎ, బి1, బి6, సి, మాంగనీస్, బయోటిన్, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు ఉన్నాయి. అయితే, ఈ సమయంలో మనకు ఎదురయ్యే సమస్యలను తట్టుకోవాలంటే.. కచ్చితంగా వీటిని తినాల్సిందే. దీనిని కాయ రూపంలో తినొచ్చు .. లేదంటే జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయ వలన మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

సమ్మర్ లో ఎంతో మంది ఎదుర్కొనే సమస్యల్లో డీహైడ్రేష‌న్‌ కూడా ఒకటి. నీరు ఎంత తాగినా.. వేసవి తాపానికి ఆ నీరు ఇట్టే ఇంకిపోతుంది. దీంతో, శరీరం డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ తగులుతుంది. అయితే, అలా జరగకుండా ఉండాలంటే పుచ్చకాయను తీసుకోవాలి. దీంతో, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.

పుచ్చకాయను ( Watermelon  )  వారంలో మూడు సార్లు తీసుకుంటే.. శరీరం మొత్తం క్లీన్ అవుతుంది. ఆ తర్వాత,  ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే, వేసవి కాలంలో ఎండలో తిరిగే వారి చర్మం నల్లగా మారి స్కిన్ సమస్యలు కూడా వస్తాయి. అలాంటప్పుడు పుచ్చకాయ జ్యూస్‌ను తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. అలాగే గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధ పడేవారు పుచ్చకాయను తినాలి.పుచ్చకాయను విటమిన్ సి, కెరోటిన్ జుట్టు రాలిపోకుండా చేస్తుంది. అలాగే, వీటిలో ఉండే ఔషధ గుణాలు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. గుండె సమస్యలు ఉన్న వారికి ఇది సూపర్ ఫుడ్. దీనిని ఎక్కువ తీసుకుంటే .. రక్త సరఫరా మెరుగు పడడమే కాదు, హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News