Summer Drinks: వేసవి చంపేస్తుంది.. ఈ డ్రింక్స్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
సమ్మర్ వచ్చేసింది. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సమ్మర్ వచ్చేసింది. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేటేడ్‌గా ఉంచుకోవాని చెబుతున్నారు. లేదంటే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తలకిందులవుతోంది. ఈ నేపథ్యంలో వేసవిలో శరీరాన్ని చల్లబరిచే పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో అధికంగా నీళ్లు తాగటం తప్పనిసరి. అయితే నీళ్లతో పాటు క్రమం తప్పకుండా చెరకు రసాన్ని తాగితే శరీరానికి తక్షణం శక్తిని అందిస్తుంది. అలాగే, శరీరం హైడ్రేటేడ్ చేసి, వేడి దుష్ప్రభావాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చెరకు రసం కామెర్లు రోగులకు టానిక్‌గా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. శరీరానికి సరైన జీర్ణక్రియను నిర్వహించడం, ఎముకలను బలోపేతం చేయడం, రక్తహీనతను తొలగించడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.
అలాగే, చింతపండు రసం కూడా శరీరాన్ని చల్లబర్చటంలో సాయపడుతుంది. ఇందులో విటమిన్ C, A, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చింతపండులోని తీపి, పుల్లని నీరు శరీరాన్ని చాలా సేపు హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టే ముందు చింతపండు నీరు తాగడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. అలాగే, వడ దెబ్బ తగిలిన వారు చింతపండు నీరు తాగడం వల్ల వాంతులు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. ఈ క్రమంలో కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో నీటి శాతాన్ని కాపాడుకోవచ్చు. ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఒక గ్లాసు తాగడం వల్ల కొత్త శక్తి వస్తుంది. అలాగే, వేసవిలో అజీర్ణం అనేది సాధారణ సమస్య. దీనిని నివారించడంలో కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే, కొబ్బరి నీరు అధిక చెమటను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కిడ్నీ సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది.
నిమ్మకాయలో విటమిన్ C, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ B-6, E, ఫోలేట్ వంటి విటమిన్లు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వేసవిలో శరీరాన్ని హైడ్రేటేడ్‌గా ఉంచే పానీయాల్లో నిమ్మరసం చీఫ్ అండ్ బెస్ట్ అని చెప్పాలి. అలాగే నిమ్మ రసం శరీరం నుంచి విషపూరిత మూలకాలను తొలగించడం ద్వారా బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇవి కాకుండా మజ్జిగ, రాగి జావ కూడా వేడి తాపం నుంచి కాపాడటంలో సాయపడుతాయి. అలాగే, పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ, కీరదోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉంటే పండ్లను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
Read More : స్ట్రెస్ ఈటింగ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? అయితే ఇలా ట్రై చేయండి!