Viral video: ఈ పెంపుడు కుక్కను చూడండి ఎయిర్‌పోర్టులో ఏం చేస్తుందో!
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వినియోగిస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వినియోగిస్తుంటారు. అందులో రీల్స్ చూస్తూ టైం చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో (Social media) ఎక్కువగా పెంపుడు జంతువులకు (Pets) సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా, కొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి. అవి చేసే క్యూట్ చేష్టలు, ముద్దు ముద్దు ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ ఆకర్షిస్తాయి. ఎంత స్ట్రెస్‌లో ఉన్న నవ్వులు తెప్పిస్తాయి. మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ కోవకు చెందిన ఓ వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
ఎయిర్‌పోర్టులో ప్రయాణికులంతా ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా అటు ఇటు వెళ్తున్నారు. అయితే, ఓ కుటుంబం షార్లెట్ అనే తమ పెంపుడు కుక్కను కూడా తమతో పాటు ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లింది. అక్కడ దానికి ఓ బెలూన్ దొరికింది. ఇక దాని ఆనందాన్ని అవధుల్లేవు. పైకి ఎగురుతూ ఆ బెలూన్‌ను కిందపడనివ్వకుండా కొడుతూ ఆడటం ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా అక్కుడున్న ప్రయాణికులంతా ప్రేక్షకుల్లగా మారిపోయి, దాని ఆటను ఎంజాయ్ చేశారు. దీనిని వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా, నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. స్ట్రెస్ లేని లైఫ్ అంటే ఇదే, వావ్ క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read More..
Viral video: స్టేజ్ డ్యాన్సర్‌కు డబ్బులిచ్చిన కొడుకు.. తండ్రి ఎంట్రీతో సీన్ మారిపోయింది!