ప్రతిరోజు స్నానం చేస్తున్నారా... అయితే డేంజర్ లో పడ్డట్టే..?
ఆరోగ్యమే ( Health ) మహాభాగ్యం అంటారు మన పెద్దలు. ఆరోగ్యంగా ఉండేందుకు... చాలా మంది రకరకాల టిప్స్ ఫాలో అవుతారు. హెల్తీ

దిశ, వెబ్ డెస్క్ : ఆరోగ్యమే ( Health ) మహాభాగ్యం అంటారు మన పెద్దలు. ఆరోగ్యంగా ఉండేందుకు... చాలా మంది రకరకాల టిప్స్ ఫాలో అవుతారు. హెల్తీ ఫుడ్ తీసుకొని... అనారోగ్యాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా.. వ్యాయామాలు చేయాలి. అయితే చాలా మంది.. హెల్తీ ఫుడ్ తీసుకోవడమే కాకుండా.. నిత్యం స్నానం చేస్తూ ఉంటారు.
ఫ్రెష్ గా వెలిగిపోతారు. కానీ ప్రతి రోజు స్నానం చేస్తే.. ప్రమాదమే అని ( Medical professionals) హెచ్చరిస్తున్నారు. రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి స్నానం ( Shower) చేయాలని చెబుతున్నారు. ప్రతి రోజు స్నానం చేస్తే.. చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజు స్నానం చేస్తే ఇరిటేషన్ కూడా పెరుగుతుందట. దురద కూడా లేస్తుందని అంటున్నారు. అలాగే నిత్యం స్నానం చేయడం వల్ల.. జుట్టు రాలిపోతూ ఉంటుంది. తద్వారా కొంతమంది పురుషులకు బట్టతల వస్తుందని చెబుతున్నారు.
ప్రతిరోజు స్నానం చేయకపోతే..?
ప్రతి రోజు స్నానం చేయకపోతే కొంతమందికి చర్మ వ్యాధులు ( Skin diseases ) వచ్చే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. ఒక్కో మనిషిలో ఒక్కోరకంగా.. దుష్ఫలితాలు ఉంటాయి. అందరి శరీరం ఒకలా ఉండదు. ఒక్కో మనిషి నాలుగు రోజులు స్నానం చేయకున్నా.. నడిచిపోతుంది. కానీ కొంతమంది ఒక్కరోజు స్నానం చేయకపోయినా.. ఇరిటేట్ అవుతూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం.. రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి స్నానం చేసిన.. ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.