Sibling : మనకంటూ ఓ బ్రదర్ ఉంటే..

Sibling : మనకంటూ ఓ బ్రదర్ ఉంటే..

Update: 2025-03-27 07:22 GMT
Sibling : మనకంటూ ఓ బ్రదర్ ఉంటే..
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : 

నిరాశ నిన్ను ఆవహించినప్పుడు

ఆశల హరివిల్లయ్ వికసిస్తాడు..

అతడే బ్రదర్ అంటే..

ఒంటరివై నువు కంటతడి పెడుతున్నప్పుడు

నేనున్నాను కదరా చిట్టీ.. అంటూ భుజం తడతాడు

అతడే బ్రదర్ అంటే..

సమస్యల సుడిగుండాల్లో నువ్వు చిక్కుకున్నప్పుడు

పరిష్కారమార్గమై ధైర్యం నింపుతాడు..

అతడే బ్రదర్ అంటే..

*అందుకే బ్రో.. ప్రతీ అమ్మాయి తనకంటూ ఓ బ్రదర్ ఉండాలని కోరుకునేది. ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోయినా, తనను సోదరుడిలా చూసుకునే ఓ మంచి వ్యక్తి స్నేహితుడిగానైనా లభించాలని భావిస్తుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. అన్నా చెల్లెలు లేదా అక్కా తమ్ముడి అనుబంధం ఎంత గొప్పదో. బ్రిఘం యంగ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం కూడా అదే పేర్కొన్నది. 10 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల 395 మంది అమ్మాయిలను ఈ అధ్యయనం ఎనలైజ్ చేసింది. అదనంగా అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా..

*అమ్మాయిలు లేదా మహిళలు సోదరులను కలిగి ఉండటంవల్ల జీవితంలో చాలా సంతోషంగా, ధైర్యంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. అంతేకాదు బ్రదర్స్ కలిగి ఉన్నవారిలో ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం, స్వీయ స్పృహ, ఇతరులపట్ల జాలి, దయ కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీరు ఇతరులపట్ల అసూయ భావాన్ని కలిగి ఉండరు అని, ప్రతీ విషయంలో నెగెటివ్‌గా జడ్జ్ చేయరని వెల్లడించారు. సోదరులు కలిగి ఉండటం వల్ల అమ్మాయిల్లో చిన్నప్పటి నుంచే మెరుగైన సామాజిక నైపుణ్యాలు అలవడతాయని పేర్కొన్నారు.

* సోదరులు కలిగి ఉండటం అమ్మాయిల మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని అధ్యయనం స్పష్టం చేసింది. యవ్వనంలో మాసిక ఒత్తిళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు బ్రదర్స్‌ను చూసి సిస్టర్స్ ధైర్యంగా ఉంటారట. దీంతో వారిలో ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు సోదరులతో కలిసి మెలిసి ఉండటం, వారితో కలిసి ఆడుకోవడం అమ్మాయిల్లో సామాజిక నైపుణ్యాలను మెరుగు పరుస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. భావోద్వేగ స్థిరత్వం, స్వీయ అవగాహ, విశ్వాసం వంటివి పెంపొందుతాయి.

* జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ సైకాలజీ స్టడీ ప్రకారం కూడా బ్రదర్స్ కలిగి ఉన్న అమ్మాయిలు తమ జీవితంలో స్ట్రెస్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్‌ను మేనేజ్ చేయడంలో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంటున్నారు. సోదరులు ఒక రకమైన ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్‌గా సపోర్టుగా నిలుస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మహిళలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉంటారు.

* తమకంటూ ఓ రక్షణ ఉందనే భావన సోదరులను కలిగి ఉండటం అమ్మాయిల్లో ఏర్పడుతుందట. ఇది కుటుంబంలోనే కాకుండా బయటి ప్రపంచంలో వారు ధైర్యంగా ఉండటానికి దోహదం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బాహ్య ఒత్తిడులు ఎదుర్కోవడంలో, ఆపదల నుంచి గట్టెక్కడంలో సోదరులు కలిగి ఉన్న అమ్మాయిలు ఎక్కువ ధైర్యంతో ముందడుగు వేస్తారు.

* అంతే కాకుండా సమాజంలో ఇతర అబ్బాయిలను అంచనా వేయడంలో, అర్థం చేసుకోవడంలో సోదరులు కలిగి ఉన్న అమ్మాయిలు చక్కటి అవగాహనను, జెండర్ ఈక్వాలిటీ దృక్పథాన్ని కలిగి ఉంటారు. సోదలు కలిగిన ఉండటం అమ్మాయిల వ్యక్తిత్వ వికాసానికి, సానుకూల దృక్పథం ఏర్పడటానికి ముఖ్య కారణం అవుతుంది. సమాజంలో సమానత్వం కోసం పోరాడేందుకు ధైర్యాన్ని ఇస్తుంది. వ్యక్తిగత అభివృద్ధిలో, ఒత్తి నిర్వహణలో సోదరులతో ఉన్న అనుబంధం కీ రోల్ పోషిస్తుంది. అందుకే ప్రతీ అమ్మాయి తనకంటూ ఓ బ్రదర్ ఉండాలని కోరుకుంటుందేమో అంటున్నారు నిపుణులు సైతం.

Tags:    

Similar News