Alchol: మందు బాబులు .. మత్తులో వీటిని తింటే ఇక అంతే సంగతి.. అంటున్న నిపుణులు
సాధారణంగా డ్రింక్ చేసేటప్పుడు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే తెలియకుండానే తినేస్తూ ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్ : కొందరు మద్యం సేవించేటప్పుడు ఏవో ఒక ఆహార పదార్ధాలను పక్కన పెట్టుకుని తింటారు. సాధారణంగా డ్రింక్ చేసేటప్పుడు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే తెలియకుండానే తినేస్తూ ఉంటారు. కానీ, ఆల్కహాల్ తో ఏది కలిపి తిన్నా కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనిని సేవించాక .. కొందరు వెంటనే వాంతులు చేసుకుంటారు. అలాంటి వారు మద్యంతో కలిసి ఈ ఆహారాలను తినకూడదనీ చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నూనెలు ఉండే పదార్ధాలు
ఆల్కహాల్ ఎసిడిటీని కలిగిస్తుంది. మద్యం సేవించాక ఎక్కువ నూనెలు వుండే పదార్ధాలు డిన్నర్ గా తీసుకోకండి. అలాంటి సమయంలో జీర్ణం కావాలంటే .. మనం తినేది లైట్ గా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి, తాగిన తర్వాత బిర్యానీని తీసుకోకపోవడమే మంచిది.
పాల ఉత్పత్తులు
మద్యం సేవించేటప్పుడు పాలకి సంబంధించిన పదార్ధాలను తీసుకోకపోవడమే మంచిది. ఛీజ్, బటర్, పాలు మొదలైన పదార్ధాలు జీర్ణం కావటం చాలా కష్టం. వీటిని తినడం వలన అజీర్ణం, కడుపులో మంట వంటివి కలుగుతాయి. ఛీజ్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోకూడదు.
స్పైసీ ఫుడ్స్ : డ్రింక్ చేసేటప్పుడు స్పైసీ ఫుడ్స్ ను తింటూ ఉంటారు. దీని వలన గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే, పొటాటో చిప్స్ ను ఈ సమయంలో దూరం పెట్టాలి. ఉప్పగా ఉండే పదార్ధాలు దాహాన్ని పెంచుతాయి.
స్వీట్లు: మద్యం సేవించేటప్పుడు చాక్లెట్ల వంటి తియ్యటి పదార్ధాలు తీసుకుంటే ఇది మత్తును కలిగిస్తాయి. ఆ తర్వాత, ఎక్కువగా తాగేలా చేసి పడిపోయేలా చేస్తుంది. కాబట్టి, స్వీట్లను అసలు తీసుకోకూడదు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.