High BP: హై బీపీకి చెక్ పెట్టే ఈ సీడ్స్ గురించి తెలుసా ..!
ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వ్యాధులు ( Diseases ) వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వ్యాధులు ( Diseases ) వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు మనుషుల్ని వేధిస్తున్నాయి. ఎందుకంటే, ఈ వ్యాధులు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గించడమే కాకుండా.. ఇతర వ్యాధులకు కూడా కారణమవుతాయి. అందుకే, వీటికి చెక్ పెట్టాలి. రక్తపోటు సమస్య వలన గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి. మరి, ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
అధిక రక్తపోటు సమస్యను చాలా మంది లైట్ తీసుకుంటారు. ఎందుకంటే, దీనికి లక్షణాలు పెద్దగా కనిపించవు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. గుండెకి సంబంధించిన వ్యాధులు, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మందులు వేసుకున్న మాత్రాన ఇది కంట్రోల్ లో ఉండదు. కొన్ని సీడ్స్ తీసుకుంటే .. రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే గుండె పోటు, స్ట్రోక్, కంటి సమస్యలు వస్తాయి.
ఫ్లక్స్ సీడ్స్ రక్తపోటును నియంత్రించేందుకు మంచిగా పనిచేస్తాయి. దీనిలో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. మరో అద్భుతమైన సీడ్స్ చియా సీడ్స్. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది, అధిక రక్తపోటు సమస్యను తగ్గేలా చేస్తుంది. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాల్ని రిలాక్స్ చేస్తాయి. దీనిలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో సోడియంను నియంత్రిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
READ MORE ...