వ్యక్తికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు.. ఆపరేషన్ సక్సెస్ కానీ..

కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని బతికించడం కోసం పంది కిడ్నీలను అమర్చారు డాక్టర్లు. ఇక ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. కానీ వారి ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది

Update: 2024-05-14 09:33 GMT

దిశ, ఫీచర్స్ : కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని బతికించడం కోసం పంది కిడ్నీలను అమర్చారు డాక్టర్లు. ఇక ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. కానీ వారి ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది. ఆయనకు ఇప్లాంటేషన్ చేసిన రెండు నెలలకే మరణించడు ప్రతస్తుతం ఈ వార్త చర్చానీయంశంగా మారుతోంది. ఆయన మరణానికి గల కారణాలు ఏమిటి? ఇంప్లాంటేషన్ తనపై నెగిటివ్ ప్రభావం ఏమైనా చూపిందా? అని తెలుసుకోవడానికి పరిశోధనలు చేసిన నిపుణులు.. కిడ్నీ మార్పిడికి ఆయన మరణానికి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు.

విషయంలోకి వెళ్లితే.. రిచర్డ్ స్లేమాన్ అనే వ్యక్తి కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ సమస్య తీవ్రతరం అయ్యి, తన ప్రాణానికే ప్రమాదం వాటిల్లే సిట్యూవేషన్ వచ్చింది. దీంతో తన కుటుంబ సభ్యుల అంగీకారంతో, వైద్యులు ఇంప్లాంటేషన్ ద్వారా తనకు జన్యుపరంగా మార్పులు చేసి పంది కిడ్నీని అమర్చారు. ఈ అపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది. కానీ ఊహించని విధంగా ఆయన చనిపోయారు. అయితే ఆయన మరణానికి ఈ అవయమార్పిడి జెనోట్రాన్స్ ప్లాంటేషన్ కారణం కాదు అని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా దీని వలన రిచర్డ్ మరో రెండు నెలలు బతికాడని, పంది కిడ్నీ మార్పిడి ఆయన మరణానికి కారణం కాదు అని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. కానీ ఆయన ఎందుకు మరణించాడో తెలియడం లేదు. అయితే ఒకసారి మాత్రం జెనో ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా ఒక వ్యక్తికి జనవరి 2022లో జన్యుపరంగా మార్పు చేసి పంది గుండెను అమర్చారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది. కానీ పంది గుండెలో దాగి ఉన్న ఓ వైరస్ కారణంగా ఆవ్యక్తి రెండు నెలల తర్వాత మరణించారు. కానీ రిచర్డ్ మరణానికి గత రీజన్ మాత్రం తెలియడం లేదు.


Similar News