మహిళలు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఎందుకు పూజలు చేయకూడదో తెలుసా.. సైంటిఫిక్ రీజన్ ఇదే!

మహిళలకు పీరియడ్స్ రావడం అనేది సహజం. అయితే ఈ సమయంలో అమ్మాయిలు గుడికి వెళ్లకూడదు, పూజలో కూర్చోకూడదు అని చాలా నియమాలు పెడుతుంటారు. దీని వలన అమ్మాయిలు మానసికంగా కుంగిపోతున్నారు

Update: 2024-05-21 07:32 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలకు పీరియడ్స్ రావడం అనేది సహజం. అయితే ఈ సమయంలో అమ్మాయిలు గుడికి వెళ్లకూడదు, పూజలో కూర్చోకూడదు అని చాలా నియమాలు పెడుతుంటారు. దీని వలన అమ్మాయిలు మానసికంగా కుంగిపోతున్నారు. అయితే అసలు పీరియడ్స్ టైమ్‌లో స్త్రీలు పూజలు ఎందుకు చేయకూడదొ, దానికి గల సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకుందాం.

పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలు చాలా అనారోగ్యానికి గురి అవుతుంటారు. అందుకే ఆ సమయంలో వారు రెస్ట్ తీసుకోవాలని చెబుతుంటారు. అయితే పూజ చేసేటప్పుడు చాలా పవిత్రంగా చేస్తుంటారు. ఇంటిని శుభ్రపరిచి, పద్ధతిగా చేస్తుంటారు. అయితే పీరియడ్స్ వచ్చిన స్త్రీల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. రక్తస్రావం కారణంగా వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువలన గుడి పవిత్రతను కాపాడటానికి వారిని పూజలకు దూరంగా ఉంచాలని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వారికి ఆలయాల్లోకి ప్రవేశం ఉండదంట. అయితే స్త్రీలు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చెట్లను ముట్టుకోకూడదు. ముఖ్యంగా తులసి చెట్టును ముట్టుకుంటే అది ఎండిపోతుందని చెప్తుంటారు. అయితే ఆ సమయంలో స్త్రీల శరీరంలో శక్తి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని దేవుడు సైతం సహించలేడు. అందువల్ల, పీరియడ్స్ సమయంలో పూజలు చేయడం లేదా ఆలయానికి వెళ్లడం నిషేధించబడింది.


Similar News