ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

ఈసారి మే చివరి వారం నుంచి వానలు మొదలు అయ్యాయి. ప్రతి రోజు వర్షం పడుతుంది. అయితే ఇప్పుడు వర్షాలు పడటం కామన్, కానీ రాను రాను పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతుంటాయి. అయితే వీటి

Update: 2024-06-09 02:33 GMT

దిశ, ఫీచర్స్ : ఈసారి మే చివరి వారం నుంచి వానలు మొదలు అయ్యాయి. ప్రతి రోజు వర్షం పడుతుంది. అయితే ఇప్పుడు వర్షాలు పడటం కామన్, కానీ రాను రాను పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతుంటాయి. అయితే వీటి శబ్ధాలకు చాలా మంది భయపడి పోతుంటారు. ఇంకొంత మంది పిడుగు వేస్తుందని భయంతో టీవీ, మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం లాంటి పనులు చేస్తారు. అయితే అసలు ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదో చాలా మందికి తెలియదు. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు అస్సలే బయట ఉండకూడదంట. అంతే కాకుండా పిల్లలను పొరపాటున కూడా బయటకు రానివ్వకూడదు.

2. ఉరుములు, మెరుపుల సమయంలో మీరు స్నానం గనుక చేస్తున్నట్లైతే వెంటనే మానేయాలి. లేకపోతే ప్రమాదంలో పడుతారు.

3. ఉరుములు, మెరుపుల సమయంలో ఎట్టిపరిస్థితుల్లో చెట్ల కింద ఉండకూడదు. ఎందుకంటే, చెట్ల మీద పిడుగులు ఎక్కువగా వేస్తుంది.

4.వంట గది మండే స్వభావం ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ సమయంలో ఉండకూడదు.

5. బైక్ పై వెళ్తున్నప్పుడు ఉరుములు, మెరుపులు అధికంగా ఉంటే జర్నీని ఆపివేసి, సురక్షితమై ప్రాంతానికి వెళ్లాలి.

6. అలాగే విపరీతంగా ఉరమడం, మెరుపులు వస్తున్న సమయంలో ఇంట్లో మెయిన్ ఆఫ్ చేయడం, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పెట్టకూడదు. అలాగే మొదట టీవీ మాత్రం తప్పకుండా ఆఫ్ చేయాలి.

7. స్విమ్మింగ్ ఫూల్‌లో స్నానం చేస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులు వస్తే తప్పకుండా స్విమ్మింగ్ ఫూల్ నుంచి బయటకు రావాలి ఎందుకంటే, పిడుగులు జలాశయాన్ని తాకుతాయి. ఒక వేళ అలా జరిగితే పెను విపత్తు సంభవించే అవకాశం ఉంది.


Similar News