Black pepper: నల్ల మిరియాలు రోజు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!
నల్ల మిరియాలను ‘మసాలా దినుసుల రాజు’ గా పిలుస్తుంటారు.
దిశ, వెబ్ డెస్క్ : నల్ల మిరియాలను ‘మసాలా దినుసుల రాజు’ గా పిలుస్తుంటారు. వీటి వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నల్ల మిరియాలను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీనిని కర్ణాటకలో ఎక్కువగా సాగు చేస్తారు. బ్లాక్ పెప్పర్ కార్న్ కూడా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతుంది. ఇది మన ఆహారంలో చేర్చుకుంటే అనేక సమస్యలకు చెక్ పెడుతుంది. దీనిని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
జీవక్రియను పెంచుతుంది: నల్ల మిరియాలు జీవక్రియ రేటును పెంచుతాయి. ఇది కొవ్వును కాల్చడాన్ని ప్రోత్సహిస్తుంది, అంతే కాకుండా, కొవ్వు కణాల విచ్ఛిన్నంలో ఇది సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు : నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి, హానికరమైన ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుండి కణాలను కాపాడతాయి.
దగ్గు : నల్ల మిరియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శ్వాసకోశం నుండి శ్లేష్మం క్లియర్ చేయడంలో సహాయపడతాయి.
రక్త ప్రసరణ : నల్ల మిరియాలు రక్త ప్రసరణను ప్రేరేపిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.