భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణాలు ఇవే...
ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులు పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే చిన్నచిన్న గొడవలతో విడిపోతూ ఉంటారు.
దిశ, ఫీచర్ : ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులు పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే చిన్నచిన్న గొడవలతో విడిపోతూ ఉంటారు. గొడవలు అయినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో అని ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఆలోచించకుండా విడిపోయి ఒంటరిగా ఉండిపోతారు. అలా కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని గొడవలు పడినప్పుడు సర్దుకుపోతే విడిపోయే అవకాశం ఉండదు. ఇంతకీ దంపతులు విడిపోయేంత పెద్ద గొడవలు రావడానికి అస్సలైన కారణాలు ఏంటి.. గొడవలను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మాటలనడం..
గొడవలు జరిగినప్పుడు ఒకరిని మించి ఒకరు మాటలు అనుకుంటూ ఉంటారు. అలా మాట మాట పెరిగి కొట్టుకునే వరకు గొడవలు పెరుగుతాయి. దీంతో ఇద్దరూ విడిపోయే పరిస్థితి నెలకొంటుంది. అలా జరగకుండా ఉండాలంటే గొడవలు జరిగే సమయంలో ఒకరు మాటలన్నా మరొకరు మౌనంగా ఉండడం మంచిది. తన పార్ట్నర్ కోపం తగ్గిన తరువాత తన మంచి చెడులను చూస్తే చాలు మాటలన్నవారే తిరిగి క్షమాపన చెబుతారు. దీంతో వారి కాపురం సక్రమంగా ఉంటుంది.
ఎదుటివారితో పోల్చడం..
భర్త కానీ, భార్య కానీ తన భాగస్వామిని వేరే వారితో పోల్చడం సరికాదు. అలా పోల్చినప్పుడు వారి మనోభావాలు దెబ్బతిని గొడవకు దిగుతారు. దీంతొ వారిద్దరూ విడిపోయే ప్రమాదం లేకపోలేదు. అయితే ఎవరిలో ఉండాల్సిన ప్రత్యేకతలు వారికి ఉంటాయి. అలాగని తన భాగస్వామిని ఎదుటి వారితో పోల్చడం మానేయాలి.
అర్థం చేసుకోకపోవడం..
భార్యభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని మెదిలితే వారి సంసారం ఆనందంగా ఉంటుంది. అర్థం చేసుకోని పక్షంలోనే గొడవలు తలెత్తుతూ ఉంటాయి. భార్య చెప్పిన మాటకి భర్త, భర్త చెప్పిన మాటకి భార్య విలువ ఇవ్వకపోతే గొడవలు జరుగుతాయి. సంసారంలో ఎదుటివారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకవడం ముఖ్యం.
పెద్ద వారిని గౌరవించకపోవడం..
భార్యాభర్తలు తమ పుట్టింటి వారికి, అత్తింటి వారికి మర్యాదలు ఒకేలా చేసినప్పుడు ఎలాంటి గొడవలు జరగవు. హెచ్చుతగ్గులు చూపించినప్పుడు మాత్రమే గిల్లికజ్జాలు జరుగుతాయి.