క్యాన్సర్ వస్తే కనిపించే ప్రైమరీ లక్షణాలు ఏవో తెలుసా?
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఇక ఇటీవల అనేకమందిని పట్టి పీడిస్తున్న వ్యాధి క్యాన్సర్. ఈ మధ్యకాలంలో ఆడ, మగ, చిన్న,
దిశ, ఫీచర్స్ : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఇక ఇటీవల అనేకమందిని పట్టి పీడిస్తున్న వ్యాధి క్యాన్సర్. ఈ మధ్యకాలంలో ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఈ మహమ్మారి ఎక్కువగా వంశపారపర్యంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఈ క్యాన్సర్‌తో పోరాడి మరణిస్తున్నారంట. ఓ సర్వేప్రకారం 2020లో 10 మిలియన్లకు పైగా క్యాన్సర్‌తో మరణించినట్లు సమాచారం. ఈ వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడవు. కొన్ని సార్లు తెలుసుకొనే లోపే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కావున క్యాన్సర్ వ్యాధిని ముందుగానే పసిగట్టాలి. ఈ వ్యాధి వస్తే ముందుగానే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
అలసట : క్యాన్సర్ లక్షణాలు ఒకొక్కటి బయటపడుతుంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారిలో అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. రోజు రోజుకు చాలా నీరసంగా, అలసటగా కనిపిస్తారు. అంతే కాకుండా వారు ఎంత తిన్నా కూడా బరువు పెరగకపోవడం జరుగుతుంది.
వేగంగా బరువు తగ్గడం : క్యాన్సర్ లక్షణాలలో బరువు తగ్గడం ఒకటి. సడెన్‌గా బరువు తగ్గితే ప్రతి ఒక్కరూ ఎక్కువగా పట్టించుకోరు. కానీ అకస్మాత్తుగా బరువు తగ్గడానికి కూడా క్యాన్సర్ ఒక కారణం.
తలనొప్పి: తలనొప్పి అసాధారణం అనుకుంటారు. కానీ క్యాన్సర్ ఉన్న వారికి మాత్రమే తరచుగా, పదే పదే తల నొప్పి వస్తుంటుందంట. ఇది బ్రెయిన్ ట్యూమర్ ప్రధాన లక్షణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
శరీరంపై దద్దుర్లు: లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడేవారు అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. శరీరమంతా దద్దుర్లు ఉన్నాయి. భుజం కింద చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలు పగిలిపోవడం వల్ల ఈ దద్దుర్లు వస్తాయి.
కళ్లలో నొప్పి: కళ్లలో నొప్పి ఉండటం కూడా క్యాన్సర్‌కు కారణం. కళ్లలో క్యాన్సర్ కణాలు పెరగడం వలన రోజూ కళ్లలో నొప్పి వస్తుందంట. అందువలన కళ్లలో నొప్పి ఉంటే అశ్రద్ధ చేయకూడదు అంటున్నారు వైద్యులు.
( నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు)