మాస్క్‌డ్.. నాన్ మాస్క్‌డ్ ఆధార్ కు గల తేడా ఏంటో తెలుసా..

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ కార్డ్ కంపల్సరీ.

Update: 2024-01-11 08:42 GMT

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ కార్డ్ కంపల్సరీ. బ్యాంకింగ్ నుండి మొదలుకుని ఉద్యోగం వరకు ఏ పనిలోనైనా ఆధార్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొన్నిసార్లు ఆధార్ కార్డుని డౌన్‌లోడ్ చేసినప్పుడు ఆధార్ నంబర్‌లు సగం మాస్క్‌తో వస్తుంది. అంటే ఆధార్ కార్డులోని కొన్నినంబర్లు కనిపించకుండా ఉంటాయి. అలా వచ్చినప్పుడు కాస్త ఖంగారు పడేవారు ఉన్నారు. అలా కాకుండా పూర్తినంబర్లతో ఆధార్ కార్డును ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మాస్క్‌డ్ ఆధార్ అంటే ఏమిటి ?

మాస్క్‌డ్ ఆధార్ కార్డు అంటే కార్డులోని మొత్తం 12 అంకెలలో మొదటి 8 అంకెలు కనిపించవు. చివరి 4 నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. అందుకే దీన్ని మాస్క్‌డ్ ఆధార్‌ అంటారు. నిజానికి ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డుని వినియోగించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్నిసార్లు మీ పూర్తి ఆధార్ కార్డ్ నంబర్‌ని కొన్ని డాక్యుమెంట్‌లో రాయవలసి ఉంటుంది. అలాంటప్పుడే ఈ పూర్తినంబర్లు కలిగిన ఆధార్ అవసరం ఉంటుంది.

మాస్క్‌డ్ ఆధార్ నంబర్

దీనికోసం మీరు పెద్దగా చేయవలసిన అవసరం లేదు. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసినప్పుడల్లా, మీకు రెండు ఎంపికలు లభిస్తాయి. మొదటి ఆప్షన్‌లో మాస్క్‌డ్ ఆధార్ ఉంటుంది. రెండవది నాన్ -మాస్క్డ్/అన్‌మాస్క్డ్ ఆధార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎంపికల నుండి, మీరు మీ అవసరాన్ని బట్టి ఏదైనా ఆధార్‌ని ఎంచుకోవచ్చు. మాస్క్‌డ్ ఆధార్‌లో మొదటి 8 అంకెలు రాకుండా చివరి 4 నంబర్లు మాత్రమే ఉంటాయి. నాన్-మాస్క్డ్ ఆధార్‌లో, మొత్తం 12 నంబర్‌లు చూపిస్తుంది.

Tags:    

Similar News