ముఖానికి ఆయిల్ క్లెన్సింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..

అందమైన ముఖాన్ని టాన్, సూర్యకాంతి నుంచి కాపాడుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Update: 2024-04-07 07:23 GMT

దిశ, ఫీచర్స్ : అందమైన ముఖాన్ని టాన్, సూర్యకాంతి నుంచి కాపాడుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వేసవిలో చర్మాన్ని అందంగా ఉంచుకునేందుకు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సీజన్‌లో సూర్యకాంతి, గాలిలో ఉండే కాలుష్యం కారకాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. అలాంటప్పుడు ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా ప్రజలు ముఖాన్ని శుభ్రం చేయడానికి ఫేస్ వాష్‌ను ఉపయోగిస్తారు. అయితే ముఖాన్ని శుభ్రపరుచుకునేందుకు ఫేస్ వాష్ కాకుండా ఆయిల్ క్లీన్సింగ్ ని కూడా ఉపయోగిస్తారట.

ప్రస్తుతకాలంలో ఆయిల్ క్లెన్సింగ్ వాడకం ట్రెండ్‌లో ఉంది. అందాన్ని పెంచుకోవాలనుకునేవారు ఈ క్లెన్సర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో నూనెను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేస్తారు. మీరు పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి సులభంగా దీన్ని ఉపయోగించవచ్చు. అలాంటి ఆయిల్ క్లీన్సింగ్ గురించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

ఆయిల్ క్లీన్సింగ్..

ఆయిల్ క్లెన్సింగ్ సహాయంతో ముఖం మీద ఉండే దుమ్ము, మేకప్ లేదా సన్‌స్క్రీన్ తొలగించవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఇది ముఖం పై ఉండే మురికిని తొలగిస్తుంది. చాలా సార్లు సాధారణ ఫేస్ వాష్‌తో మేకప్ లేదా సన్‌స్క్రీన్ పూర్తిగా తొలగిపోదు. కొన్నిసార్లు మితిమీరిన శుభ్రత చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. అందుకే ముఖాన్ని డీప్ క్లీన్ చేయాలనుకుంటే ఆయిల్ క్లెన్సింగ్ అనేది మంచి ఎంపిక.

ఏ నూనె వాడాలి..

ఆయిల్ క్లీన్సింగ్ కోసం మీ చర్మానికి అనుగుణంగా ఉండే నూనెను ఎంచుకోండి. దీని కోసం మీ చర్మం పొడిగా ఉందా లేదా జిడ్డుగా ఉందా అనేది తెలుసుకోవడం ముఖ్యం. పొడి లేదా మొటిమలకు గురయ్యే చర్మం కోసం మీరు జోజోబా, లవంగం లేదా యూకలిప్టస్ నూనెను ఉపయోగించవచ్చు. లేదా అవకాడో, ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు.

ఎలా శుభ్రపరచాలి

ఆయిల్ క్లెన్సింగ్ కోసం 1 లేదా 2 చెంచాల నూనెను మీ చేతులకు తీసుకుని ముఖానికి అప్లై చేయండి. దీని తరువాత చర్మాన్ని 5 నుండి 10 నిమిషాలు మసాజ్ చేయండి. ఇప్పుడు మీ ముఖాన్ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. దీంతో నూనెలోని ముఖ్యమైన పోషకాలు ముఖం లోపలికి చేరుతాయి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. చర్మాన్ని శుభ్రపరిచిన తర్వాత, మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు. ఆయిల్ క్లీన్సింగ్ మచ్చలు, మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News