హోలీ ఆడిన తర్వాత మీ స్కిన్ పొడిగా మారిందా.. బెస్ట్ ఫేస్ ప్యాక్‌లు మీ కోసం
నేడు హోలీ పండుగ సెలబ్రేషన్స్ ముగిశాయి. రాష్ట్రమంతటా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డే మొత్తం తెగ ఎంజాయ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నేడు హోలీ పండుగ సెలబ్రేషన్స్ ముగిశాయి. రాష్ట్రమంతటా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డే మొత్తం తెగ ఎంజాయ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు రంగుల మయం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు హోలీగా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
రంగు నీటితో కూడా హోలీ ఆడుకున్నారు. కానీ తర్వాత స్కిన్ కు పట్టిన హోలీ రంగు కారణంగా కొంతమంది చర్మం కాస్త పొడిగా మారుతుంది. మరీ ఈ సమస్య నుంచి బయటపడాలంటే నిపుణులు చెప్పిన ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పచ్చిపాలు పసుపుతో మీ స్కిన్‌ను మునుపటిగా మార్చుకోవచ్చు. ఇవి మంచి రిజల్ట్‌ను చూపిస్తాయి. ఇందుకోసం మీరు ముందుగా పచ్చిపాలు అడ్ చిటికెడు పసుపు తీసుకుని రెండు కలపండి. తర్వాత ఫేస్ ను క్లీన్ గా కడుక్కుని.. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి.
ఒక పదిహేను నిమిషాల తర్వాత కాటన్‌తో ముఖాన్ని తుడిచి గోరు వెచ్చటి వాటర్‌తో లేదా నార్మల్ వాటర్‌తో వాష్ చేస్తే మీ స్కిన్ తళతళ మెరిసిపోతుంది. అంతేకాకుండా పాలు మీ ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. మృతకణాల్ని కూడా తొలగిస్తుంది.
అలాగే బాదం అండ్ తేనె మిక్స్ చేసి ఫేస్ కు అప్లై చేయండి. బాదం పప్పుల్ని రాత్రి నానబెట్టి మిక్సీపట్టి బాదం, తేనె ముఖానికి రాసుకోండి. 20 నిమిషాలు ఉంచాక నార్మల్ వాటర్‌తో కడగండి. హోలీ రంగుల వల్ల మీ స్కిన్ కు కలిగిన హాని తొలగిపోతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.