Water Bottle - Heart Disease : ప్రయాణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ నీరు తాగితే గుండె జబ్బులు ఖాయం

పర్యావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. ప్రకృతి మొత్తం ప్లాస్టిక్ మయంగా మారింది. మనిషి రక్తం, ఊపిరితిత్తులు, గుండెతోపాటు ప్రైవేట్ పార్ట్స్ లో కూడా ప్లాస్టిక్ చేరిందంటే ఎంత దారుణంగా పొల్యూట్ చేసిందనేది అర్థం

Update: 2024-08-10 06:14 GMT

దిశ, ఫీచర్స్: పర్యావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. ప్రకృతి మొత్తం ప్లాస్టిక్ మయంగా మారింది. మనిషి రక్తం, ఊపిరితిత్తులు, గుండెతోపాటు ప్రైవేట్ పార్ట్స్ లో కూడా ప్లాస్టిక్ చేరిందంటే ఎంత దారుణంగా పొల్యూట్ చేసిందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధన.. ప్లాస్టిక్ బాటిల్ లోని నీరు కూడా కలుషితమేనని, ఈ వాటర్ తాగితే బీపీ అధికం అవుతుందని గుర్తించింది. ఈ నీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్స్ వల్ల రక్తపోటు పెరుగుతుందని రుజువు చేసింది. అదే ఇతర బాటిల్స్ లో నీరు తాగేవారిలో బీపీ గణనీయంగా తగ్గుతుందని గుర్తించింది.

మైక్రాప్లాస్టిక్స్ ఆహారం, నీటిలో ప్రబలంగా ఉన్న చిన్న ప్లాస్టిక్ కణాలు. కాగా ఇవి మానవ ఆరోగ్యంపై భారీ ఎఫెక్ట్ చూపుతున్నాయి. గుండె అనారోగ్యం, హార్మోన్ ఇంబ్యాలెన్స్, క్యాన్సర్ వంటి సమస్యలతో ముడిపడి ఉన్నాయి. కాగా తాజాగా ప్లాస్టిక్ బాటిల్ వాటర్, బీపీ మధ్య కనెక్షన్ గురించి పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఈ సీసాల్లో నీటి వాడకం తగ్గిస్తే బీపీ కంట్రోల్ అయినట్లు చెప్పారు. అలాగే కంటిన్యూ చేస్తే పెరిగినట్లు గుర్తించామన్నారు. అంటే ప్లాస్టిక్ వినియోగం తగ్గితే బీపీ తగ్గుతుంది కాబట్టి రక్తంలో ఉన్న ప్లాస్టిక్ కణాలు అధిక రక్తపోటుకు దోహదం చేస్తాయని గుర్తించామని అంటున్నారు శాస్త్రవేత్తలు. కాగా ప్లాస్టిక్ బాటిల్ లోని వాటర్ ద్వారా వారానికి సుమారు ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్ మన కడుపులో చేరుతుందని గత అధ్యయనాలు హెచ్చరించాయి. ఈ పరిస్థితిని నిరోధించేందుకు పంపు నీటిని మరిగించి, ఫిల్టర్ చేసి తాగడం బెస్ట్ అని సూచించాయి. మొత్తానికి ప్లాస్టిక్ బాటిల్ వాటర్ మోస్ట్ డేంజరస్ కాగా బస్సులు, రైళ్లలో మంచినీటి బాటిల్స్ కొనొద్దని, ఇంటి నుంచి వస్తున్నప్పుడే స్టీల్ అండ్ కాపర్ బాటిల్ లో నీరు తెచ్చుకోవడం మంచిదని చెప్తున్నారు.

Tags:    

Similar News