Bread: రోజూ బ్రెడ్ తినేవారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

బ్రెడ్‌ జామ్ ( Bread Jam) , బ్రెడ్-బటర్ ( Bread Butter) తింటుంటారు

Update: 2025-01-04 06:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : జీవనశైలి మారుతున్న కొద్దీ అలవాట్లు కూడా మారుతున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొందరికీ ఉదయాన్నే లేచి టిఫిన్ ( Tiffin) చేసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక చేసేదేమి లేక బ్రెడ్‌ జామ్ ( Bread Jam) , బ్రెడ్-బటర్ ( Bread Butter) తింటుంటారు. కాకపోతే, బ్రెడ్ అతిగా తీసుకోవడం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని రోజూ తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

బ్రెడ్‌లో కొవ్వు పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను పెంచే అవకాశం ఉంది. అలాగే, గుండె ఆరోగ్యాన్ని బల పరచుకోవాలనుకుంటే  బ్రెడ్‌కు దూరంగా ఉండాలి.మీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే బ్రెడ్‌ను తినకండి. రోజూ బ్రెడ్ తినే వ్యక్తులు రక్తంలో చక్కెర సమస్య వస్తుంది. ఇది, బ్లడ్ లో షుగర్ ను పెంచుతుంది. అలాగే, రొట్టెలను కూడా మితంగా తినడం మంచిది.

బ్రెడ్ ఎక్కువగా తినే వ్యక్తులు కడుపు నొప్పి, గ్యాస్, పొట్ట సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిలో ఉండే పిండి మీ పేగు ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. అలాగే, దీనిని జీర్ణం చేసుకోవడానికి కడుపుకి చాలా సమయం పడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే ,మీ డైట్ లో బ్రెడ్‌కు ఫ్రూట్స్ ను చేర్చుకోవాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News