శీతాకాలంలో పాయా సూప్ తాగండి.. ఊహించని ప్రయోజనాలు?

శీతాకాలంలో పాయా సూప్ తాగితే బోలెడు లాభాలున్నాయని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు.

Update: 2025-01-05 16:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: శీతాకాలంలో పాయా సూప్(Paya Soup) తాగితే బోలెడు లాభాలున్నాయని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. చలికాలంలో గుండె జబ్బుల(Heart disease)తో పాటు అనేక సమస్యల్ని దూరం చేస్తాయని అంటున్నారు. పాయా సూప్ వింటర్ లో చాలా స్పెషల్ అని చెప్పుకుంటారు. టేస్టీగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో అనేక మినరల్స్(Minerals), విటమిన్లు(vitamins) పుష్కలంగా ఉంటాయి. కాగా బాడీని వెచ్చగా ఉంచడంలో మేలు చేస్తుంది. జలుబు కాకుండా, స్థూలకాయాన్ని(Obesity) దూరం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలను స్ట్రాంగ్(Strong bones) గా ఉంచడంలో, బరువు తగ్గించడం(weight loss)లో, వాపును తగ్గించడం(reducing inflammation)లో తోడ్పడుతుంది. వీటితో పాటు మెరిసే చర్మం కూడా మీ సొంతమవుతుంది. కాగా చలికాలంలో పాయా సూప్ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. 

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News