Bandi Sanjay: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి.. బండి సంజయ్ మాస్ వార్నింగ్

కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి (Ramesh Bhadhuri) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ (Telangana)లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Update: 2025-01-07 08:56 GMT
Bandi Sanjay: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి.. బండి సంజయ్ మాస్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి (Ramesh Bhadhuri) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ (Telangana)లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే రమేశ్ బిధూరి (Ramesh Badhuri) వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ తెలంగాణ బీజేపీ కార్యాలయం (Telangana BJP Office) ముట్టడికి యూత్ కాంగ్రెస్ (Youth Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు కోడి గుడ్లు, రాళ్లును విసురుతూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడిలో పలువురు బీజేపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటనపై కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) తీవ్రంగా స్పందించారు. దాడులు చేస్తే బీజేపీ (BJP) చూస్తూ ఊరుకోదని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలే తలుచుకుంటే గాంధీ భవన్ (Gandhi Bhavan) పునాదులు కూడా మిగలవని మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు రాళ్లతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని.. చట్టపరంగా తమ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని బండి సంజయ్ అన్నారు.  

Tags:    

Similar News