MLC Balmuri : కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి: ఎమ్మెల్సీ బల్మూరి
ఫార్ముల ఈ రేసు కేసు(Formula E Race Case)లో విచారణ(Inquiry)తప్పించుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విదేశాలకు పారిపోయే అవకాశముందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat)కీలక ఆరోపణలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ఫార్ముల ఈ రేసు కేసు(Formula E Race Case)లో విచారణ(Inquiry)తప్పించుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విదేశాలకు పారిపోయే అవకాశముందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat)కీలక ఆరోపణలు చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసీబీ, ఈడీ విచారణలను తప్పించుకునే ప్రయత్నంలో కేటీఆర్ విదేశాలకు పారిపోకుండా ముందస్తుగా విచారణ శాఖలు కేటీఆర్ పాస్ పోర్టును సీజ్ చేయాలని కోరారు.
డ్రామారావు కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణలకు వెళ్లకుండా..సహకరించకుండా రాజకీయ డ్రామాలు వేస్తున్నాడని విమర్శించారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసినా కేటీఆర్ బుద్ధి మార్చుకోకుండా విచారణ తప్పించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బంది ఎందుకని కేటీఆర్ ను బల్మూరి నిలదీశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేయాలని..వారిని ప్రజలు తమ సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకంతో ఎన్నుకున్నారన్నారు. వారు మాత్రం ప్రజలను వదిలేసి ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితల కోసం పనిచేస్తున్నారని బల్మూరి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కోసం, ఆ కుటుంబం సమస్యల కోసం, ప్రజల సొమ్మును దోచుకున్న ఆ కుటుంబం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా ఉంటారా లేక ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి సహరిస్తారా ఆలోచించుకోవాలని డిమాండ్ చేశారు.